టీమిండియా ఆటగాడు, స్టార్ ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యాకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. వెన్నునొప్పితో ఫిట్నెస్ కోల్పోయి, ఆ తర్వాత జాతీయ జట్టులో స్థానం కూడా కోల్పోయిన పాండ్యాను బీసీసీఐ బెంగుళూరులోని ఎన్సీఏ క్యాంప్‌కు హాజరుకావాలని సూచించింది. మార్చి 5వ తేదీనే అక్కడ రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తూ.. ఒక వేళ క్యాంప్‌కు హాజరు కాకుంటే చర్యలు తప్పవని పాండ్యాను హెచ్చరించినట్లు సమాచారం. బీసీసీఐ సెలక్షన్ కమిటీ వార్నింగ్ తలొగ్గిన పాండ్యా మంగళవారం ఎన్సీఏ క్యాంప్‌కు చేరుకున్నాడు.
జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లు గాయపడ్డా, ఫిట్నెస్ కోల్పోయినా బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లి రిహ్యాబిటేషన్ సెంటర్లో పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధిస్తారు. అక్కడ వారికి సహాపడేందుకు వీవీఎస్ లక్ష్మణ్‌తో సీనియర్ స్టాఫ్, ఫిజియోలు ఉంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ అకాడమీని స్థాపించింది. ప్రస్తుతం కోచ్ రాహుల్ ద్రవిడ్ గతంలో దీనికి చైర్మన్‌గా కూడా వ్యవహరించాడు. ఇప్పుడు చైర్మన్ లక్ష్మణ్ ఉన్నాడు. రోహిత్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, భువనేశ్వర్ కుమార్ కూడా గాయాల పాలైన సమయంలో ఇక్కడే ఫిట్ అయ్యారు. కానీ హార్థిక్ జాతీయ జట్టుకు దూరమైన చాలా రోజులు అవుతున్నా కూడా ఎన్సీఏకు వెళ్లలేదు. అయినా కూడా పెద్దగా పట్టించుకోని బోర్డు.. ఇప్పుడు మాత్రం కాస్త సీరియస్ అయినట్లు తెలుస్తుంది.
అందుకు కారణం.. రాబోయే టీ20 వరల్డ్ కప్‌తో పాటు జూన్‌లో సౌత్ఆఫ్రికాతో సిరీస్ కోసం హార్థిక్ పాండ్యాను సెలక్షన్ కమిటీ ఇప్పటికీ పరిశీలిస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. కానీ పాండ్యా మాత్రం అవేవి పట్టనట్లు ఇంట్లోనే కూర్చున్నాడు. దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ రంగంలోకి దిగి పాండ్యాకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏకంగా సెలక్షన్ కమిటీ నుంచి హెచ్చరికలు రావడంతో పాండ్యా ఎన్సీఏకు రాక తప్పలేదు. ఇప్పటికే ప్రారంభం అయినా క్యాంప్‌లో మొత్తానికి జాయిన్ అయ్యాడు. ఈ క్యాంప్ ఈ నెల 15వ తేదీ వరకు 10 రోజుల పాటు జరగనుంది.
ఈ క్యాంప్‌లో వెస్టిండీస్ సిరీస్‌లో గాయపడ్డ క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఈ క్యాంప్ తర్వాత ఆటగాళ్లు వారివారి ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లతో వెళ్లి జాయిన్ అవుతారు. ఈ నెల 26 నుంచి ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దీంతో పాండ్యా ఈ క్యాంప్ తర్వాత గుజరాత్ జట్టులో చేరి ప్రాక్టీస్‌లో పాల్గొంటారు. అలాగే ఐపీఎల్ కోసం ఈ ఎన్సీఏ క్యాంప్‌కు పాండ్యాకు ఎంతో ఉపయోగపడనుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
After stern warning from BCCI selectors, Hardik Pandya does a U-Turn, will attend NCA camp ahead of IPL;#IPL2022 #HardikPandya https://t.co/uMIAgIHGnl
— InsideSport (@InsideSportIND) March 8, 2022