హార్దిక్ పాండ్యా.. చాలా కాలం తరువాత టీమిండియాకి దొరికిన నిజమైన, విలువైన ఆల్ రౌండర్. కపిల్ దేవ్, ఇర్ఫాన్ పఠాన్ తరువాత ఇంతలా మరే ఇండియన్ ఆల్ రౌండర్ టీమ్ లో సత్తా చాటలేకపోయాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ లో అయితే పాండ్యా పవర్ హిట్టింగ్ కి తిరుగు ఉండదు. కానీ.., ఈ ఘనత అంతా గత చరిత్రే. గత కొంత కాలంగా హార్దిక్ పాండ్యా ఫామ్ లో లేడు. పైగా.. గాయాలతో ఫిట్ నెస్ కోల్పోయాడు. అన్నిటికీ మించి టీమ్ లో కాంపిటేషన్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే పాండ్యా టీ20 వరల్డ్ కప్ తరువాత పాండ్యా టీమ్ లో స్థానం కోల్పోయాడు.
ఒక రకంగా ఇది హార్దిక్ కెరీర్ లో బ్యాడ్ టైమ్ గా చెప్పుకోవచ్చు. ఇలాంటి క్లిష్ట స్థితిలోనే ఈ స్టార్ ఆల్ రౌండర్ ఓ సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. తన దూకుడైన ఆట తీరుకి సరిపడే వన్డే, టీ20 ఫార్మేట్స్ పై మరింత శ్రద్ద పెట్టడానికి.. హార్దిక్ పాండ్యా టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది.
హార్దిక్ పాండ్యా ప్రస్తుతం రీహాబిటేషన్ పేరుతో ఎన్‌సీఏ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. తాను పూర్తిగా ఫిట్ అయ్యి, ఫామ్ లోకి వచ్చే వరకు తనని సెలక్ట్ చేయవద్దు అంటూ సెలక్టర్లుకి హార్దిక్ ఓపెన్ గానే చెప్పేశాడు. కాబట్టి.. హార్దిక్ పాండ్యా ఇప్పట్లో టీమ్ లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇలాంటి స్థితిలోనే హార్దిక్ ఇంత కఠినమైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో హార్దిక్ పాండ్యా నుండి అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
హార్దిక్ పాండ్యా తన కెరీర్ లో మొత్తం11 టెస్టులు ఆడి.. 532 పరుగులతో సహా 17 వికెట్లు దక్కించుకున్నాడు. ఇక హార్దిక్ చివరి టెస్ట్ మ్యాచ్ ఆడి మూడేళ్ళ పైనే అవుతోంది. మరి.. హార్దిక్ పాండ్యా టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇవ్వాలన్న నిర్ణయడానికి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.