ఐపీఎల్.. వరల్డ్ టీ20 లీగ్ లకు పెద్దన్న. ఇక ఈ లీగ్ ఎప్పుడైతే ప్రారంభం అయ్యిందో.. అప్పటి నుంచి వరల్డ్ వైడ్ గా పుట్టగొడుల్లా పుట్టుకొచ్చాయి మరిన్ని టీ20 లీగ్ లు. అయితే ఐపీఎల్ లో ధోని, రోహిత్ లలో బెస్ట్ కెప్టెన్ ఎవరు? అన్న ప్రశ్నకి తమ అభిప్రాయాలను తెలియజేశారు సెహ్వాగ్, బజ్జీలు.
IPL.. టీ20 క్రికెట్ ప్రపంచంలో అగ్రగామి టోర్నీగా మన్ననలు పొందుతోంది. ప్రతీ ఏడాది వేసవిలో క్రికెట్ ప్రేమికులను ఫోర్లు, సిక్సర్లతో సేదతీరుస్తుంది. ఇక ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుంచి వినపడుతున్న కామన్ క్వశ్చన్ ఐపీఎల్ ఉత్తమ సారథి ఎవరు? అని. ఈ టోర్నీ ప్రారంభం అవుతుంది అంటే చాలు ఈ మెగా టీ20 లీగ్ లో బెస్ట్ కెప్టెన్ ఎవరు అనే దానిపై ఎప్పుడూ చర్చజరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్ ఎవరు అనేదానిపై సెహ్వాగ్, హర్భజన్ సింగ్ 15 ఏళ్ల ఐపీఎల్ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ధోని, రోహిత్ లలో బెస్ట్ కెప్టెన్ ఎవరు అనేదానిపై తమ అభిప్రాయాన్ని తెలిపారు.
మహేంద్ర సింగ్ ధోని.. ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ కెప్టెన్ లలో ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక IPLలో ధోనికి తిరుగులేని రికార్డు ఉన్నది. ఇప్పటి వరకు చెన్నైకి నాలుగు ట్రోఫీలు అందించాడు ధోని. ఇక మరోవైపు టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఈ మెగా టోర్నీలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ముంబై జట్టుతోనే కెప్టెన్ గా మారిన రోహిత్.. ముంబైకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలను అందించాడు. దాంతో వీరిద్దరిలో బెస్ట్ ఐపీఎల్ కెప్టెన్ ఎవరు? అనే చర్చ వచ్చింది. ఇదే విషయంపై ’15 ఏళ్ల ఐపీఎల్’ కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్, హర్భజన్ లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. రోహిత్, ధోనిలలో బెస్ట్ ఐపీఎల్ సారథిగా తమ ఓటు ఎవరికో ఈ కార్యక్రమంలో చెప్పారు.
ముందుగా సెహ్వాగ్ మాట్లాడుతూ..”నా దృష్టిలో బెస్ట్ ఐపీఎల్ కెప్టెన్ రోహిత్ శర్మనే. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. అందుకో ఒకటి అతడు కెప్టెన్ గా ఎక్కువ ఐపీఎల్ ట్రోఫీలు గెలవడమే. ఇక రెండోది అతడు ముంబై జట్టుతోనే కెప్టెన్ గా అవతారం ఎత్తాడు. కానీ ధోని అలా కాదు. టీమిండియాకు సారథ్యం వహించిన తర్వాత చైన్నైకి కెప్టెన్ గా చేశాడు. అందుకే ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్ గా నేను రోహిత్ నే ఎన్నుకుంటున్నాను” అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయంలో సెహ్వాగ్ తో విభేదించాడు టీమిండియా టర్బోనేటర్ హర్భజన్ సింగ్.
నా ఓటు ధోనికే అని స్పష్టం చేశాడు టీమిండియా టర్బోనేటర్ హర్భజన్ సింగ్. చెన్నైని విజయవంతమైన జట్టుగా తీర్చిదిద్దడంలో ధోని కీలక పాత్ర పోషించాడు అని బజ్జీ చెప్పుకొచ్చాడు. అతడు జట్టును నడిపించే తీరు అద్భుతం అని బజ్జీ కితాబిచ్చాడు. ఇక 10 ఏళ్లు నేను ముంబాయికి ఆడాను, నా మనసు అటే లాగుతున్నప్పటికీ నా ఓటు ధోనికే అని బజ్జీ అన్నాడు. ఇక IPL 15వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. మరి ధోని, రోహిత్ లలో మీ బెస్ట్ కెప్టెన్ ఎవరో అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.