దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు ఆడేందుకు టీమిండియా సౌతాఫ్రికాకు వెళ్లింది. క్వారంటైన్ ముగించుకుని.. ప్రాక్టీస్ సెషన్‌ను ప్రారంభించింది. ఈ ప్రాక్టీస్ సెషన్ ఆరంభంలో ఆటగాళ్లంతా కలిసి వాలీబాల్, ఫుట్‌బాల్ ఆటను మిక్స్ చేసి ఆడాడు. టీమ్ మొత్తం రెండు జట్లుగా విడిపోయి ఆడింది. ఒక జట్టుకు అశ్విన్, మరో జట్టుకు కోచ్ రాహుల్ ద్రావిడ్ కెప్టెన్లుగా ఉన్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లు చాలా సరదాగా కనిపించారు. కోచ్ ద్రావిడ్ ప్రతిభ చూసి ఆశ్చర్యపడ్డ విరాట్.. రాహుల్‌ను అభినందించిన సందర్భం ఫ్యాన్స్ చాలా బాగా నచ్చింది.
అలాగే ఈ మ్యాచ్‌లో అశ్విన్, పుజారా మధ్య మాటామాటా కూడా జరిగింది. ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు వేర్వేరు జట్లలో ఉన్నారు. దాంతో ఆట రూల్స్ విషయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రాక్టీస్ సెషన్ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది. మరి ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్, ఆటగాళ్ల మధ్య చిన్న చిన్న గొడవలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: దక్షిణాఫ్రికా టూర్‌పై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. కోహ్లీ ఆడిస్తాడనే నమ్మకం లేకనేనా?
How did #TeamIndia recharge their batteries ahead of their first training session in Jo’Burg? 🤔
On your marks, get set & Footvolley! ☺️😎👏👌#SAvIND pic.twitter.com/dIyn8y1wtz
— BCCI (@BCCI) December 18, 2021