స్టార్ ప్లేయర్లు లేకుండానే రెండో వన్డేలో బరిలోకి దిగిన భారత జట్టు అనూహ్య పరాజయాన్ని చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో వన్డే కి ముందు ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేసాడు.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా తొలి వన్డేలో గెలిచి రెండో వన్డేలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. విండీస్ లాంటి బలహీనమై జట్టు మీద తొలి వన్డేలో సింపుల్ గానే గెలిచిన మన జట్టు రెండో వన్డేలో ప్రయోగాలకు పెద్ద పీట వేసి చేతులు కాల్చుకుంది. తక్కువగా అంచనా వేసారో లేకపోతే వరల్డ్ ఉన్న నేపథ్యంలో బెంచ్ ని పటిష్టం చేసుకుందామనుకున్నారో తెలియదు గాని విండీస్ చేతిలో ఊహించని పరాజయాన్ని చవి చూసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే బరిలోకి దిగిన టీమిండియా తగిన మూల్యం చెల్లించుకుంది. దీంతో టీమిండియా మీద ముఖ్యంగా హెడ్ కోచ్ ద్రవిడ్ మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. చెత్త ప్రయోగాలు చేస్తూ టీంని భ్రష్టు పట్టిస్తున్నాడని, అతడిని హెడ్ కోచ్ బాధ్యతల నుండి తొలగించాల్సిందిగా డిమాండ్లు వినిపించాయి. అయితే తాజాగా ద్రవిడ్ మూడో వన్డేలో కూడా ఇదే జట్టుతో ఆడతామని హింట్ ఇచ్చేసాడు.
మరో రెండు నెలల్లో ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి రెండు మెగా టోర్నీలు ఉండడంతో టీమిండియా మిడిల్ ఆర్డర్ మీద ఇంకా స్పష్టత రాలేదు. స్టార్ ప్లేయర్లు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా గత కొంతకాలంగా భారత క్రికెట్ కి దూరమయ్యారు. ఐతే వీరి గాయాల మీద ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఆసియా కప్ కి సెలక్ట్ అయ్యేది అనుమానంగానే మారింది. దీంతో ఇప్పుడు మిడిల్ ఆర్డర్ ని పటిష్టం చేసేందుకు సంజు శాంసన్, సూర్య కుమార్ యాదవ్ లకు వరుస అవకాశాలు ఇస్తూ వస్తుంది. ఇందుకు భాగంగా గానే రెండో వన్డేలో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బెంచ్ కే పరిమితమయ్యారు. అయితే సిరీస్ ని నిర్ణయించే మూడో వన్డేలో వీరిద్దరూ బరిలోకి దిగడం ఖాయమని భావించారంతా. కానీ ద్రవిడ్ మాత్రం మేము దేనికీ భయపడడం లేదు. ఎవ్వరి మాటలు పట్టించుకోము. మూడో వన్డేలో కూడా యువకులకు ఛాన్స్ ఇస్తామని తెలియజేశాడు.
ద్రవిడ్ మాట్లాడుతూ ” మేము దూర దృష్టితో ఆలోచిస్తున్నాము. ఆసియా కప్ వన్డే వరల్డ్ కప్ కి ఎంతగానో సమయం లేదు. మా జట్టులో కీలక ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతున్నారు. ఈ సమయంలో మేము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి చిన్న విషయం గురించి లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగని ప్రతి మ్యాచ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మేము వాటి గురించి ఆలోచిస్తే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం”. అని ప్రయోగాలు చేస్తామని పరోక్షంగా కోచ్ ద్రావిడ్ తెలియజేశాడు. మరి ద్రవిడ్ చెప్పినట్లుగా మూడో వన్డేలో ప్రయోగాలు చేస్తుందా? లేకపోతే సీనియర్లతో బరిలోకి దిగుతుందేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.