ఉపఖండపు పిచ్ ల మీద ఆసియా కప్ జరుగుతున్నా.. టీమిండియా లెగ్ స్పిన్నర్ చాహల్ కి 17 మందిలో చోటు లభించలేదు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ.. చాహల్ వరల్డ్ కప్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
యాషెస్ సిరీస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రనౌట్ తీరుపై వివాదం చెలరేగింది. అసలు రనౌట్ విషయంలో మెరిల్ బోన్ క్రికెట్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
వెస్టిండీస్ తో రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ చేసేందుకు భారత్ 8 వికెట్ల దూరంలో నిలిచింది. చివరి రోజు మ్యాచ్ లో అశ్విన్ ను ఎదుర్కోవడం కరీబియన్లకు కష్టమే అని సిరాజ్ అభిప్రాయపడ్డాడు.
భారత్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ టెస్టు మ్యాచ్ ఆడితే రికార్డులు బద్దలవ్వడం గ్యారంటీగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఎన్నో ప్రపంచ రికార్డులని తన ఖాతాలో వేసుకున్నాడు.
36 ఏళ్ళ వయసులో కూడా అత్యున్నత ప్రదర్శన చేస్తూ రికార్డులు బద్దలు కొడుతున్నాడు టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్. దీంతో అశ్విన్ రిటైర్మెంట్ ప్రస్తావన ఎప్పుడు రాలేదు. ఇదిలా ఉండగా తాజాగా అశ్విన్ తన రిటైర్మెంట్ గురించి చెప్పుకొస్తూ ఎమోషనల్ అయ్యాడు.
బ్యాట్స్‌మన్ ఔట్ల విషయంలో ప్లేయర్లు రివ్యూ కోరే అవకాశం క్రికెట్లో ఉంది. అంపైర్లు ఇచ్చిన నిర్ణయంపై సమీక్షకు వెళ్లే ఛాన్స్ బ్యాటింగ్ టీమ్‌తో పాటు బౌలింగ్ జట్టుకూ ఉంది. అయితే ఒకే బాల్‌కు రెండుసార్లు రివ్యూకు వెళ్లడం మాత్రం ఇప్పటిదాకా జరగలేదు.
ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా చేతుల్లో పరాభవంతో రెండేళ్లు పడిన శ్రమ అంతా వృథా అయింది. దీనికి టీమిండియా సెలెక్షన్, ఆటతీరును అందరూ తప్పుబడుతున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి రోజు భారత్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. చక చక మూడు వికెట్లు తీసి పట్టు బిగించినట్లుగా కనబడినా.. స్మిత్, హెడ్ జోడీ విడదీయలేక నానా తంటాలు పడ్డారు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా వెళ్తుంది. ఓకవేళ అశ్విన్ గనుక తుది జట్టులో ఉంటే ఫలితం వేరేలా ఉండే అవకాశం లేకపోలేదు.
డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టు సెలెక్షన్ విషయంలో భారత్ తప్పు చేసిందన్నాడు ఆస్ట్రేలియా జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్. రోహిత్ అనవసరంగా ఒక ట్రాప్‌లో పడ్డాడన్నాడు.