పాకిస్థాన్ క్రికెటర్లు తమ చెత్త ఫీల్డింగ్‌తో మరోసారి నవ్వులపాలయ్యారు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో భాగంగా గురువారం పెషావర్ ఝాలిమ్, లాహోర్ ఖలందర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు మొహమ్మద్ హఫీజ్, ఫకర్ జమాన్ ఒక సునాయాస క్యాచ్‌ను నేలపాలు చేశారు. సమన్వయ లోపంతో క్యాచ్‌ను జారవిరవడంతో మిగతా ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా నవ్వుకున్నారు.
గతంలో పాకిస్తాన్– వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో కూడా ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి చోటుచేసుకుంది. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ షమర్ బ్రూక్స్ కొట్టిన భారీ షాట్ గాల్లోకి లేచింది. దీంతో బౌండరి లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న పాక్ ఆటగాడు హసైన్ క్యాచ్ అందుకునే వచ్చాడు. అదే సమయంలో మరో ఆటగాడు ఇఫ్తికర్ అహ్మెద్ కూడా క్యాచ్ కోసం వచ్చాడు. ఒక్కరు పడ్తారని ఇంకొకరు అనుకోవడంతో ఇద్దరి మధ్య బాల్ పడింది. దీంతో ఇద్దరూ చూస్తూ ఉండిపోయారు. సునాయసమైన క్యాచ్‌ను సమన్వయ లోపంతో నేలపాలు చేశారు. అలాగే గతంలో కూడా ఉతప్ప ఇచ్చిన క్యాచ్‌ను కూడా ఇదే విధంగా పాక్ ఆటగాళ్లు వదిలేశారు. తాజాగా ఫకర్, హఫీజ్ వదిలేసిన క్యాచ్‌ను ఆ రెండు క్యాచ్‌లతో పోల్చుతూ.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. పాక్ ఆటగాళ్లు క్యాచ్ పట్టడడం వదిలేసి.. చమ్మచెక్కాలు ఆడుతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఆ క్యాచ్ విషయమై.. ఇద్దరు ఆటగాళ్లు తర్వాత సరదాగా మాట్లాడుకున్నారు. ఆ క్యాచ్ నాదంటే నాదని చెప్పుకున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. విశేషం ఏమిటంటే.. క్యాచ్ వదిలిపెట్టిన ఫొటోను ఫకర్ జమాన్ తన ట్విట్టర్ ప్రొఫైల్ ఫిక్‌గా పెట్టుకున్నాడు. మరి ఈ మొత్తం ఎపిసోడ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Dropped! 😕#HBLPSL7 l #LevelHai l #PZvLQ pic.twitter.com/Y4Hok5eCtb
— PakistanSuperLeague (@thePSLt20) February 2, 2022
@MHafeez22 bhai thank you for your understanding 😇 https://t.co/8y2Z5ZCbOw pic.twitter.com/lWraAzjsfC
— Fakhar Zaman (@FakharZamanLive) February 3, 2022
#NewProfilePic pic.twitter.com/6ThU7TqBpj
— Fakhar Zaman (@FakharZamanLive) February 2, 2022
Amit Mishra came pretty close to Saeed Ajmal with that drop catch of Uthappa #IPL pic.twitter.com/x6GjvkDuW1
— Shubh Aggarwal (@shubh_chintak) April 28, 2017
We have seen this before?🤔pic.twitter.com/aeJOcefmjG
— CricTracker (@Cricketracker) December 16, 2021