స్టార్ క్రికెటర్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి భారీ చోరీకి పాల్పడ్డారు. ఆ ఇంటి నుంచి దాదాపు రూ. 80 లక్షల విలువైన విదేశీ కరెన్సీ, విలువైన వస్తువులు దోచుకెళ్లారు. ఈ ఘటన మార్చి 5న జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆసియా కప్ 2022 లో సూపర్-4లో భాగంగా జరిగిన భారత్-పాక్ మ్యాచ్ పై ఇప్పటికీ చర్చ నడుస్తూనే ఉంది. కొంత మంది భారత్ కు మద్దతుగా నిలుస్తుంటే.. మరి కొందరు ఇండియాను విమర్శిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో క్యాచ్ మిస్ చేసి తీవ్ర విమర్శల పాలు అవుతోన్న అర్ష్ దీప్ వీకీపీడియా వ్యవహారాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఇక భారత జట్టుకు బీజేపీ నాయకురాలు విజయశాంతి సైతం అండగా నిలబడ్డారు. ఈ క్రమంలోనే […]
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ సంచలన కామెంట్ చేశాడు. రోహిత్ శర్మ భయపడుతున్నాడంటూ.. ఎక్కువ కాలం కెప్టెన్‌గా కొనసాగడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్‌లో టీమిండియా రెండు వరుస విజయాలు సాధించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన భారత్.. తర్వాత మ్యాచ్‌లో హాంకాంగ్‌ను ఓడించి.. సూపర్ ఫోర్ చేరింది. కానీ.. హాంకాంగ్‌పై విజయం సాధించినా భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముఖంలో ఆనందమే లేదని, కెప్టెన్సీ […]
పాకిస్థాన్ కి సంబంధించిన క్రికెట్ ఆటగాడు మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన కిడ్నీ సంబంధింత వ్యాధితో లండన్ లో చికిత్స చేయించుకుంటున్నారు.. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా కూడా రావడంతో పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూకి తరలించిన వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అబ్బాస్ కు న్యూమోనియా కూడా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు డయాలిసిస్ తో పాటు […]
టీ20 ప్రస్థానం మొదలయ్యాక క్రికెట్ అంటేనే బ్యాట్టింగ్ ఫ్రెండ్లీ అయిపోయింది. ఈ పొట్టి ఫార్మాట్ లో ఉన్న రూల్స్ బ్యాటర్లకు అనుకూలంగా ఉండడంతో.. ఎంతటి బౌలరైనా ఎలా బంతులు వేయాలా అని వ్యూహాలు రచిస్తూ ఉంటాడు. మలింగా యార్కర్లతో.. ఆర్చర్ బౌన్సర్లతో..బుమ్రా యాంగిల్ తో..ఇలా ఒక్కొక్క బౌలర్ ఒక్కొక్క విధంగా.. వైవిధ్యంగా బంతులేస్తూ బ్యాటర్లను ఇబ్బందిపెట్టడానికి చూస్తుంటారు. ఏది ఏమైనా ధనా ధన్ ఇన్నింగ్స్ లో బ్యాటర్లది కొంచెం పైచేయిగా ఉంటది. అయితే.. ఈ పొట్టి ఫార్మాట్ […]
పాకిస్థాన్ క్రికెటర్లు తమ చెత్త ఫీల్డింగ్‌తో మరోసారి నవ్వులపాలయ్యారు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో భాగంగా గురువారం పెషావర్ ఝాలిమ్, లాహోర్ ఖలందర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు మొహమ్మద్ హఫీజ్, ఫకర్ జమాన్ ఒక సునాయాస క్యాచ్‌ను నేలపాలు చేశారు. సమన్వయ లోపంతో క్యాచ్‌ను జారవిరవడంతో మిగతా ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా నవ్వుకున్నారు. గతంలో పాకిస్తాన్– వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో కూడా ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి చోటుచేసుకుంది. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ […]
ఇటివల కొందర దిగ్గజ క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలుకుతున్నారు. ఈ వరుసలో తాజాగా పాకిస్థాన్ ఆల్ రౌండర్, మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ రిటైర్మెంట్ కూడా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి అధికారికంగా తన నిర్ణయం ప్రకటించాడు. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికాడు మహ్మద్ హఫీజ్. పాకిస్థాన్ తరపున విజయవంతమైన ఆటగాళ్లలో హఫీజ్ ఒకడు. అంతర్జాతీయ వేదికపై అతని చివరి టోర్నమెంట్ 2021 టీ20 ప్రపంచ కప్‌గా నిలిచింది. […]