పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో బిగ్ మ్యాన్ అజమ్ ఖాన్ అదరగొడుతున్నాడు. భారీ సిక్సర్లతో ప్రత్యర్థి టీమ్స్‌పై విరుచుకుపడుతున్న అజమ్.. సొంత టీమ్ ప్లేయర్లను మాత్రం రనౌట్ చేయిస్తున్నాడు.
మ్యాచ్ గెలవాలంటే.. చివరి 7 బంతుల్లో 9 రన్స్ చేయాల్సిన తరుణంలో పాక్ క్రికెటర్ అజమ్ ఖాన్‌ను నమ్మి రెండో రన్‌కు వచ్చిన బ్యాటర్ దారుణంగా మోసపోయాడు. ఒక్క పరుగు తీసి స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉండిపోయిన అజమ్ ఖాన్.. తన బ్యాటింగ్ పార్ట్నర్‌ను అవుట్ చేయించాడు. ఈ ఫన్నీ రనౌట్ పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో చోటు చేసుకుంది. క్రికెట్‌లో నవ్వులపాలయ్యే సంఘటనల సృష్టికర్తలుగా నిలిచే పాకిస్థాన్ క్రికెటర్లు మరోసారి తమ బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను ఈ రనౌట్ రూపంలో చూపించారు. అయినా.. బిగ్ మ్యాన్ అజమ్ ఖాన్‌ను నమ్ముకుని రెండో రన్‌కు రావడం అవుటైన బ్యాటర్ తప్పే అంటూ కొంతమంది క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
పాకిస్థాన్ సూపర్ లీగ్ 8వ సీజన్‌లో భాగంగా శుక్రవారం రావాల్పిండి వేదికగా ఇస్లామాబాద్ యూనైటెడ్-కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కరాచీ కెప్టెన్ ఇమద్ వసీమ్ 54 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 92 పరుగులు చేసి రాణించాడు. వసీమ్ చెలరేగడంతో 78కే నాలుగు వికెట్లు కోల్పోయినా.. కరాచీ 200 మార్క్‌ను దాటింది. ఈ కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇస్లామాబాద్.. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. 69 పరుగులకే 3 వికెట్లు పడిపోవడం లక్ష్యం కష్టంగా మారింది. ఈ క్రమంలో ఫహీమ్ అష్రఫ్‌తో జతకలిసి బిగ్ మ్యాన్ అజమ్ ఖాన్.. కరాచీ బౌలర్లపై తన పవర్ హిట్టింగ్‌తో విరుచుకుపడ్డాడు.
ఫోర్లు, సిక్సర్లను అలవొకగా బాదేస్తూ.. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఇస్లామాబాద్ విజయం దిశగా సాగింది. చివరి 7 బంతుల్లో 9 పరుగులు అవసరమైన దశలో అష్రఫ్ మిడ్ వైపు గాల్లోకి బంతి ఆడాడు. దాన్ని ఫీల్డర్ క్యాచ్ అందుకోకపోవడంతో బతికిపోయిన అష్రఫ్ రెండో రన్ కోసం వెళ్లాడు. కానీ.. అప్పటికే అజమ్ ఖాన్ ఒక పరుగు పూర్తి చేసి.. రెండో రన్ కోసం మూమెంట్ ఇచ్చాడు. దాంతో అష్రఫ్ స్ట్రైకింగ్ ఎండ్‌కు దూసుకెళ్లాడు. ఈ లోపు ఫీల్డర్ బాల్ అందుకోవడం చూసి.. అజమ్ ఖాన్ తిరిగి క్రీజ్‌లోకి వెళ్లిపోయాడు. కానీ.. అష్రఫ్ మాత్రం అలానే ముందుకు వెళ్లిపోయాడు.
దీంతో ఇద్దరు బ్యాటర్లు ఒక్క ఎండ్‌కే చేరిపోయాడు. ఫీల్డర్ నుంచి బాల్ అందుకున్న వికెట్ కీపర్ మెల్లగా బౌలర్ చేతికి బాల్ ఇవ్వడంతో అష్రఫ్ రనౌట్ అయ్యాడు. చివర్లో ఇలాంటి హైడ్రామా జరిగినా.. చివరి ఓవర్‌లో 8 పరుగులు అవసరమైన దశలో హసన్ అలీ తొలి రెండు బంతుల్లో సిక్స్, ఫోర్ బాదేయడంతో ఇస్లామాబాద్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అజమ్ ఖాన్ 41 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఇస్లామాబాద్‌ను గెలిపించాడు. మరి ఈ మ్యాచ్‌లో అష్రఫ్ రనౌట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.