క్రీజ్ నుంచి బయటికి వచ్చి కొడితే.. చాలా సేపు గాల్లో రాకెట్‌లా ప్రయాణించిన బంతి.. వెళ్లి స్డేడియం బయట రోడ్డుపై పడింది. ఆ షాట్లకు ఆరుకంటే ఎక్కువ రన్స్ ఇవ్వాలని ఆ షాట్ చూపిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అలాంటి షాట్‌నే కరేబియన్ వీరుడు బాదాడు.
క్రికెట్‌లో ఫోర్లు, సిక్సులు చాలా కామన్. అప్పుడప్పుడు భారీ సిక్సులు, విచిత్రమైన షాట్లకు సిక్స్ వెళ్లడం కూడా సాధారణమే. కానీ.. కరేబియన్లు కొట్టే సిక్సులు మాత్రం ప్రత్యేకంగా ఉంటాయి. ఆ షాట్లకు ఆరుకంటే ఎక్కువ రన్స్ ఇవ్వాలని ఆ షాట్ చూపిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అంతలా ఆ అతి భారీ సిక్సులు క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాయి. గతంలో వెస్టిండీస్ క్రికెటర్లు క్రిస్ గేల్, రస్సెల్, పొలార్డ్ భారీ సిక్సర్లకు పెట్టింది పేరుగా నిలిచేవారు. ఇప్పుడు వారి వారసత్వాన్ని రోవ్‌మన్ పావెల్ కొనసాగిస్తున్నాడు. మనిషన్నవాడు ఇలాంటి సిక్సులు కొట్టడం అసాధ్యం అనే రీతిలో అతి భారీ సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. ఎన్నో కష్టాలకు ఓర్చి, అతి పేద కుటుంబం నుంచి, కేవలం డబ్బుల కోసమే క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన పావెల్.. ఇప్పుడు తన భారీ షాట్లతో ప్రపంచ స్థాయి బౌలర్లను సైతం వణికిస్తున్నాడు.
తాజాగా పావెల్ కొట్టిన ఒక భారీ సిక్స్ ఏకంగా స్టేడియం బయటికి వెళ్లిపడింది. క్రీజ్ నుంచి బయటికి వచ్చి కొడితే.. చాలా సేపు గాల్లో రాకెట్‌లా ప్రయాణించిన బంతి.. వెళ్లి స్డేడియం బయట రోడ్డుపై పడింది. ఈ భారీ షాట్ పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో భాగంగా పెషావర్ జల్మీ-క్వాట్టా గ్లాడియేటర్స్ మధ్య బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. మొహమ్మద్ నవాజ్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ తొలి బంతికి పావెల్ భారీ సిక్స్ బాదాడు. ఆ సిక్స్ పాకిస్థాన్ సూపర్ లీగ్ చరిత్రలోనే బిగెస్ట్ సిక్స్‌ల్లో ఒకటిగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో పావెల్ 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో చెలరేగి 35 రన్స్ చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. పెషావర్ కెప్టెన్ బాబర్ అజమ్ 65 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సులతో 115 పరుగులు చేసి సెంచరీతో చెలరేగడంతో పాటు ఓపెనర్ సైమ్ అయ్యూబ్ 74 పరుగులతో రాణించడంతో పెషావర్ భారీ స్కోర్ చేసింది. చివర్లో పావెల్ మెరుపు ఇన్నింగ్స్ కూడా పెషావర్‌కు భారీ స్కోర్ అందించేందుకు తోడైంది. ఇంతటి భారీ లక్ష్యాన్ని సైతం క్వాట్టా ఊదిపడేసింది. ఆ జట్టు ఓపెనర్ జాసన్ రాయ్ 63 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సులతో 145 పరుగులు చేసి పెషావర్ ఓటమిని శాసించాడు. 241 పరుగుల భారీ టార్గెట్‌ను క్వాట్టా గ్లాడియేటర్స్ కేవలం 18.2 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో పెషావర్ ఓడినా.. ఆ జట్టు ఆటగాడు పావెల్ కొట్టిన భారీ సిక్స్ మాత్రం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rovman Powell, what a shot 👏 #HBLPSL8 pic.twitter.com/hrJaON9hLL
— Farid Khan (@_FaridKhan) March 8, 2023