పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో భారీ స్కోర్లు నమోదమవుతున్నాయి. బౌండరీలు చిన్నగా ఉండటం, పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకులిస్తుండటంతో బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. బంతి బంతికి బౌండరీలు కొడుతూ అభిమానులకు అసలు మజాను పంచుతున్నారు. బుధవారం క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ మధ్య జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఆజం, జాసన్ రాయ్ సెంచరీలతో మెరవగా, తాజాగా లాహోర్ క్వాలండర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ సీనియర్ బ్యాటర్ ఫఖర్ జమాన్ విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ వెటరన్ బ్యాటర్, నలుమూలలా బౌండరీలు బాదుతూ స్టేడియం దద్దరిల్లేలా చేసాడు.
పాక్ గడ్డపై జరుగుతోన్న పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో భారీ స్కోర్లు నమోదమవుతున్నాయి. బౌండరీలు చిన్నగా ఉండటం, పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకులిస్తుండటంతో బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. బంతి బంతికి బౌండరీలు కొడుతూ అభిమానులకు అసలు మజాను పంచుతున్నారు. బుధవారం క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ మధ్య జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఆజం, జాసన్ రాయ్ సెంచరీలతో మెరవగా, తాజాగా లాహోర్ క్వాలండర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ సీనియర్ బ్యాటర్ ఫఖర్ జమాన్ విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ వెటరన్ బ్యాటర్, నలుమూలలా బౌండరీలు బాదుతూ స్టేడియం దద్దరిల్లేలా చేసాడు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లాహోర్ క్వాలండర్స్‌కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న అబ్దుల్లా షఫిక్(1) సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కమ్రాన్ గులాంతో జత కలిసిన ఫఖర్ జమాన్ ఆకాశమే హద్దుగా చెలరిగిపోయాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మొత్తంగా 57 బంతులు ఎదుర్కున్న జమాన్ 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేశాడు. కమ్రాన్ గులాం 41 పరుగులతో రాణించగా, సామ్ బిల్లింగ్స్ 32 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి లాహోర్ 5 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఇస్లామాబాద్ బౌలర్లలో హసన్ అలీ మినహా మిగిలిన అందరి ఎకానమీ 10కి పైగా ఉండటం గమనార్హం.
One word for Fakhar Zaman’s blistering innings today#PSL8 #IUvLQ pic.twitter.com/PZrVhJ9oPY
— Cricket Pakistan (@cricketpakcompk) March 9, 2023
అనంతరం 227 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇస్లామాబాద్ 107 పరుగులకే చాప చుట్టేసింది. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్టుగా పెవిలియన్ చేరడంతో కేవలం 15.1 ఓవర్లలోనే వారి ఇన్నింగ్స్ ముగిసింది. లాహోర్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా, హ్యారిస్ రౌఫ్ 2, జమాన్ ఖాన్ 2, డేవిడ్ వీస్ 1 వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో లాహోర్ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విజయం ఎలా ఉన్న సోషల్ మీడియాలో పీఎస్ఎల్ టోర్నీపై విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. రికార్డుల కోసం బౌండరీలను కుదించి టోర్నీ నిర్వహిస్తున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పీఎస్ఎల్ టోర్నీపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Fakhar Zaman goes huge 🚀
(via @thePSLt20) #PSL2023 pic.twitter.com/7dMjuozeKc
— ESPNcricinfo (@ESPNcricinfo) March 9, 2023
Lahore Qalandars affirm their position at the top with a huge win! 💪
Fakhar Zaman (115) outscored the whole Islamabad United team 🤯https://t.co/XJL7vSH3jw | #PSL2023 pic.twitter.com/VFJpnpVMDm
— ESPNcricinfo (@ESPNcricinfo) March 9, 2023