పాకిస్తాన్ క్రికెట్ లీగ్ (పీఎస్ఎల్)లో సంచలనాలు నమోదవుతున్నాయి. బౌండరీలు చిన్నగా ఉండటం, పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండంటంతో బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. 230.. 240 పరుగుల లక్ష్యాలను సైతం అలవోకగా ఛేదిస్తున్నారు. రికార్డు స్థాయిలో బౌండరీలు నమోదవుతూ.. మునుపటి రికార్డులు కనుమరుగవుతున్నాయి.
‘అయితే సిక్స్.. లేదంటే ఫోర్..‘ పాక్ గడ్డపై జరుగుతోన్న పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్ఎల్)లో ఇదే జరుగుతోంది. ప్రతి రెండు బంతులకు ఒక బౌండరీ నమోదవుతోంది. బౌండరీలు చిన్నగా ఉండటం, పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండంటంతో బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. 230.. 240 పరుగుల లక్ష్యాలను సైతం అలవోకగా ఛేదిస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ హిట్టర్ రిలే రస్సో తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కళ్లు చెదిరేలా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అతని ధాటికి ప్రత్యర్థి జట్టు నిర్ధేశించిన 242 పరుగుల లక్ష్యం సైతం చిన్నదయ్యింది.
నాలుగు రోజుల క్రితం పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య జరిగిన మ్యాచ్ జరగగా, 240 పరుగుల లక్ష్యాన్ని క్వెట్టా 10 బంతులు మిగిలివుండగానే ఛేదించింది. నాలుగు క్రితం వరకు ఇదే పీఎస్ఎల్ టోర్నీలో హైయెస్ట్ చేజింగ్. ఇది బద్దలవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు. శుక్రవారం పెషావర్ జల్మీ, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య జరిగిన మ్యాచులో ఆ రికార్డు కనుమరుగైంది. పెషావర్ నిర్ధేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని సుల్తాన్స్ మరో 5 బంతులు మిగిలిఉండగానే ఛేదించింది. రెండు మ్యాచుల్లోనూ ప్రత్యర్థి జట్టు పెషావరే కావడం గమనార్హం. ఇది టీ20 చరిత్రలో సెకండ్ హయ్యెస్ట్ ఛేజింగ్.
🚨 Rilee Rossouw broke his own record for the fastest PSL century. (His previous record – 43 balls)#RileeRossouw #PSL8 pic.twitter.com/VKKFk1Y0bM
— CricTracker (@Cricketracker) March 10, 2023
ఈ సంచలన విజయానికి కారణం.. సౌతాఫ్రికా బ్యాటర్ రిలే రస్సో. 41 బంతుల్లోనే సెంచరీ మార్క్ చేరుకున్న ఈ పవర్ హిట్టర్, 51 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. ఇది పీఎస్ఎల్ టోర్నీ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ కాగా, తన పేరిట ఉన్న రికార్డును తానే బ్రేక్ చేశాడు.
కాగా, అంతకుముందు బ్యాటింగ్ చేసిన పెషావర్.. నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ఆ జట్టు సారథి బాబర్ ఆజమ్ (73; 39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా, యువ ఓపెనర్ సయీబ్ అయూబ్ (58), మహ్మద్ హరీస్ (35), కోహ్లర్-కాడ్మోర్ (38) లు రాణించారు. ఈ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rilee Rossouw loves playing in the Pakistan Super League 🔥♥️ #HBLPSL8 pic.twitter.com/PQinekezWy
— Farid Khan (@_FaridKhan) March 10, 2023
Points Table #PSL8 After Game 27th. #PSL #PSL2023 #QuettaGladiators #MultanSultans #PeshawarZalmi #RileeRossouw pic.twitter.com/KCWtmokdPn
— CricCircle (@thecriccircle) March 11, 2023