పాకిస్థాన్ సూపర్ లీగ్.. క్రికెట్ లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. నిన్ననే దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ రిలీ రోసో రికార్డు శతకంతో కదం తొక్కగా.. ఈ రోజు ఆ రికార్డు సెంచరీని బ్రేక్ చేశాడు ఉస్మాన్ ఖాన్.
పాకిస్థాన్ సూపర్ లీగ్.. క్రికెట్ లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ టీ20 లీగ్ లో బ్యాటర్లు చెలరేగుతుండటంతో.. బౌలర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. నిన్ననే దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ రిలీ రోసో రికార్డు శతకంతో కదం తొక్కగా.. ఈ రోజు ఆ రికార్డు సెంచరీని బ్రేక్ చేశాడు ఉస్మాన్ ఖాన్. క్వెట్టా గ్లాడియేటర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముల్తాన్ సుల్తాన్స్ బ్యాటర్స్ పూనకం వచ్చినట్లుగా వీరకొట్టుడు కొడుతున్నారు. ముఖ్యంగా ముల్తాన్ టీమ్ ఓపెనర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ 36 బంతుల్లోనే రికార్డు సెంచరీ చేశాడు. పీఎస్ఎల్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం.
పాకిస్థాన్ సూపర్ లీగ్ లో భాగంగా తాజాగా క్వెట్టా గ్లాడియేటర్స్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముల్తాన్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ రికార్డు సెంచరీతో చెలరేగాడు. దాంతో నిన్న ముల్తాన్స్ జట్టు బ్యాటర్ అయిన రిలీ రోసో నెలకొల్పిన (41 బంతుల్లో) ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలు అయ్యింది. ఈ మ్యాచ్ లో మెుదటి నుంచి ఉస్మాన్ ఖాన్ ప్రత్యర్థి బౌలర్లపై ఓ యుద్ధాన్నే ప్రకటించాడు. ఈ క్రమంలోనే 36 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో పాకిస్థాన్ లీగ్ లో అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు.
ఈ క్రమంలో 43 బంతులు ఎదుర్కొన్న ఉస్మాన్ ఖాన్ 12 ఫోర్లు, 9 సిక్సర్లతో 120 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి.. మహ్మద్ నవాజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇతడు అవుట్ అయ్యే టైమ్ కు ముల్తాన్ జట్టు స్కోరు 10 ఓవర్లకు 157 అంటేనే అర్దం చేసుకోవచ్చు అతడి ఊచకోత ఏ రేంజ్ లో ఉందో. మిగతా వారిలో మహ్మద్ రిజ్వాన్ 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. మరో బ్యాటర్ టిమ్ డేవిడ్ 25 బంతుల్లో 43 పరుగులతో రాణించాడు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో ముల్తాన్ సుల్తాన్ 3 వికెట్లు కోల్పోయి 262 పరుగుల భారీ స్కోర్ చేసింది.
The fastest hundred in #HBLPSL history!
Usman Khan take a bow!#QGvMS #LetsPlaySaeen pic.twitter.com/LZVZSp0GJX
— Multan Sultans (@MultanSultans) March 11, 2023