ఇంగ్లాండ్ బ్యాటర్ జాసన్ రాయ్ పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. ప్రత్యర్థి జట్టు నిర్ధేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే ఛేదించి వారి ఆశలపై నీళ్లు చల్లాడు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌలర్లపై ఎదురుదాడికి రాయ్.. పెషావర్ జల్మీ బౌలర్లకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేశాడు. రాయ్ ధాటికి.. ముగ్గురు పాక్ బౌలర్లు అర్ధ సెంచరీలు చేయటం గమనార్హం.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) తుది అంకానికి చేరుకుంది. లాహోర్ క్వాలండర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ ఇప్పటికే సెమీస్ బెర్తులు ఖరారు చేసుకోగా.. ముల్తాన్ సుల్తాన్స్,పెషావర్ జల్మీ జట్లు నాకౌట్ పోరుకు అర్హత సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచులో క్వెట్టా గ్లాడియేటర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. పెషావర్ జల్మీ నిర్ధేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ గెలుపు పీఎస్ఎల్ చరిత్రలోనే హైయెస్ట్ చేజింగ్ కావడం గమనార్హం.
రావల్పిండి వేదికగా జరిగిన క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావర్ జల్మీ మ్యాచ్ పాక్ అభిమానులకు అసలు మజాను పంచింది. ఇరు ఇన్నింగ్స్‌లలో కలిపి ఈ మ్యాచులో 75 బౌండరీలు నమోదయ్యాయంటే మ్యాచ్ ఏ రేంజ్ లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. బంతి బంతికి ఫోరా.. సిక్సా.. అన్నట్లుగా సాగిన ఈ మ్యాచులో చివరకు క్వెట్టా గ్లాడియేటర్స్ పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 240 పరుగులు చేసింది. పాక్ సారథి బాబర్ ఆజం (115; 65 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీతో మెరవగా, యువ బ్యాటర్ సైమ్ అయూబ్ (74; 34బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులు), రోవ్ మన్ పావెల్ (35; 18 బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్సులు) పరుగులతో రాణించారు.
A historic run chase led by Jason Roy.pic.twitter.com/yPOLX6jQwG
— Johns. (@CricCrazyJohns) March 8, 2023
అనంతరం 241 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన క్వెట్టా బ్యాటర్లు పరుగుల బీభత్సం సృష్టించారు. కేవలం 6.5 ఓవర్లలోనే 100 పరుగులు చేసిన క్వెట్టా బ్యాటర్లు, 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ బ్యాటర్ జాసన్ రాయ్ పూనకం వచ్చినట్లు చెలరేగిపోయాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను చీల్చి చెండాడాడు. 44 బంతుల్లోనే సెంచరీ మార్క్ చేరుకున్న రాయ్, మొత్తంగా 63 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 145 పరుగులు చేశాడు. రాయ్ ధాటికి ప్రత్యర్థి జట్టులోని ముగ్గురు పాక్ బౌలర్లు హాఫ్ సెంచరీలు చేయటం గమనార్హం. ఈ గెలుపు పీఎస్ఎల్ చరిత్రలోనే హైయెస్ట్ చేజింగ్ కాగా, టీ20 ఫార్మాట్ లో నాల్గవ రికార్డు చేజింగ్. రాయ్ ఇన్నింగ్స్‌పై ..మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Saim Ayub was sensational. Babar Azam got a maiden PSL 💯.
But Peshawar Zalmi came up against a Jason Roy special, as Quetta Gladiators chase down 241 with 10 balls to spare 😱https://t.co/7IatfcxjwR #PZvQG #PSL2023 pic.twitter.com/jmOZpZSiFh
— ESPNcricinfo (@ESPNcricinfo) March 8, 2023