ఐపీఎల్ అనగానే అందరిలో ఒక ఉత్కంఠ, ఉత్సాహం ఉంటాయి. ఐపీఎల్ లో రాణిస్తే అంతర్జాతీయ క్రికెట్ కు దారి సుగుమం అవుతుంది. అలాంటి టోర్నమెంట్ పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రానురాను ఐపీఎల్ స్థాయి దిగజారిపోతోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ లీగ్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. బీసీసీఐ ఈ లీగ్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఒక్క భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ధనాధన్ లీగ్ కు ఎంతో క్రేజ్ ఉంది. ఈ లీగ్ లో పాల్గొనేందుకు ఆటగాళ్లు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వారి దేశాలు ఇచ్చే కాంట్రాక్టు కంటే 3 నెలలు ఐపీఎల్ ఆడినందుకే ఎక్కువ మొత్తంలో పొందుతూ ఉంటారు. పైగా ఐపీఎల్ అనేది యంగ్ క్రికెటర్లకు ఒక మంచి వేదిక. ఈ లీగ్ నుంచి టీమిండియాకి వచ్చిన వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. ఐపీఎల్ ఫ్యాన్ బేస్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఐపీఎల్ ఫ్యాన్స్ మొత్తం అటు బీసీసీఐపై ఇటు ఐపీఎల్ ప్లేయర్లపై ఆగ్రహం మాత్రమే కాదు.. అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ అయినా.. పొట్టి క్రికెట్ లీగ్ లైనా మైదానంలో చిన్నాచితక గొడవలు జరగడం సర్వసాధారణం. అయితే తర్వాత మళ్లీ ఆటగాళ్లు అంతా కలిసిపోయి సరదాగా గడపడమే కాకుండా.. ఎంతో హుందాగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఐపీఎల్ లో ఆ వాతావరణం దెబ్బతింటోంది. ప్లేయర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. సీనియర్లు- జూనియర్లపై.. జూనియర్లు- సీనియర్లపై మాటల దాడికి దిగుతున్నారు. నువ్వెంతంటే నువ్వెంత అనుకునేలా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. పైగా ఒక మ్యాచ్ నాటి గొడవను మరో మ్యాచ్ కి తీసుకొస్తూ దానిని కొనసాగిస్తున్నారు.
ఈ సీజన్ లో అయితే విజయాలు, ఛేజింగ్ లు, వికెట్లు సంగతి పక్కన పెడితే చాలానే గొడవలు జరుగుతున్నాయి. తాజాగా లక్నో- ఆర్సీబీ మ్యాచ్ తో మరోసారి క్రీడాభిమానులు తమ అసహనాన్ని వ్యక్త పరుస్తున్నారు. ఐపీఎల్ స్థాయిని దిగజారుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కమర్షియల్ లీగ్ అయినా కూడా మైదానంలో మాత్రం ఆటగాళ్లు సంయమనం, సహనం పాటించాలని, హుందాగా వ్యవహరించాలంటూ కామెంట్ చేస్తున్నారు. పాకిస్థాన్ లీగ్, శ్రీలంక లీగ్ తరహాలో ఐపీఎల్ స్థాయిని దిగజారుస్తున్నారంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు నిర్వహించే క్రికెట్ లీగ్ లో ఇలాంటి గొడవలు, వివాదాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు? మ్యాచ్ నిర్వహణ మాత్రమే కాదు.. ఆటగాళ్లు హుందాగా ప్రవర్తించేలా కూడా బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలంటూ సూచిస్తున్నారు. ఐపీఎల్ ని ఇంతకన్నా దిగజార్చకండి అంటూ కామెంట్ చేస్తున్నారు.
Why is Kohli sledging Naveen ul Haq? Kohli didn’t expect Naveen ul haq to respond like that. Looks like Kohli got scaredpic.twitter.com/uarkpacxRJ
— mvrkguy (@mvrkguy) May 1, 2023