మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్-సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగిపోయారు. తొలి వన్డేలో గెలుపుతో మంచి జోష్‌లో ఉన్న ప్రొటీస్ జట్టును 83 పరుగులకే కుప్పకూల్చి.. ఏకంగా 118 పరుగుల భారీ తేడాతో విజయం సాధించారు. వర్షం కారణంగా 29 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ధాటిగా ఆడే క్రమంలో 28.1 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌట్ అయింది.
లివింగ్‌స్టోన్ 26 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సులతో 38, సామ్ కరాన్ 18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 35 పరుగులు చేసి రాణించారు. పెద్ద కష్టసాధ్యంకానీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను ఇంగ్లండ్ బౌలర్లు వణికించారు. ముఖ్యంగా రీస్ టోప్లీ సౌతాఫ్రికా టాపర్డర్‌ను చావు దెబ్బతీశాడు. తొలి వన్డేలో సెంచరీతో చెలరేగిన డస్సెన్‌ను, స్టార్ బ్యాటర్ మలాన్‌ను ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే డకౌట్ చేసి ప్రొటీస్ పతనాన్ని శాసించాడు.
ఆ తర్వాతి ఓవర్‌లో డేవిడ్ విల్లీ తొలి బంతికే ఓపెనర్ క్వింటన్ డికాక్‌ను అవుట్ చేశాడు. అదే ఓవర్ ఐదో బంతికి మార్కరమ్‌ను ఇంగ్లండ్ కెప్టెన్, కీపర్ జోస్ బట్లర్ అద్భుతమైన రనౌట్‌తో పెవిలియన్ పంపాడు. దీంతో సౌతాఫ్రికా కేవలం 6 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి దారుణ ఓటమి వైపు అడుగులు వేసింది. హెన్రిచ్ క్లాసెన్ ఒక్కడే 33 పరుగులతో రాణించాడు.
సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్‌లో ఏకంగా నలుగురు బ్యాటర్లు డకౌట్ కాగా.. నలుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. వీరు 8 మంది కలిసి చేసిన పరుగులు కేవలం 17 మాత్రమే. ఇక డేవిడ్ మిల్లర్ 12, ప్రిటోరియస్ 17 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీంతో 20.4 ఓవర్లలో 83 పరుగులకు సౌతాఫ్రికా అలౌట్ అయి.. 118 పరుగుల తేడాతో ఓడింది. తొలి మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లండ్ రెండో వన్డేలో అద్భుతంగా పుంజుకుంది. మరి ఇంగ్లండ్ బౌలర్ల ప్రదర్శన, సౌతాఫ్రికా బ్యాటర్ల వైఫల్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Left-arm trouble 😮
South Africa are 6/3 in Manchester with Reece Topley and David Willey in the thick of the action.#ENGvSA | https://t.co/NeFiReujt4 pic.twitter.com/p6yHYQqTfF
— ICC (@ICC) July 22, 2022