దీప్తి శర్మ.. టీమిండియా వుమెన్స్ టీమ్ లో నిఖార్సైన ఆల్ రౌండర్ గా పేరొందింది. కొన్ని నెలల క్రితం ఇంగ్లాండ్ పై మన్కడింగ్ చెయ్యడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది దీప్తి శర్మ. తాజాగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది ఈ మహిళా క్రికెటర్.
ICC మహిళల టీ20 ప్రపంచ కప్ 2023 మెగా టోర్నీలో టీమిండియా సత్తా చాటుతోంది. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ పై జయభేరి మోగించిన ఇండియన్ వుమెన్స్.. రెండో మ్యాచ్ లో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ తో తలపడ్డ టీమిండియా ప్రత్యర్థి జట్టును 118 పరుగులకే కట్టడి చేసింది. నిర్ణీత 20 ఓవర్లతో విండీస్ వుమెన్స్ టీమ్ 6 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీయ్యడం ద్వారా ఓ అరుదైన రికార్డు నెలకొల్పింది టీమిండియా ఆల్ రౌండర్ దీప్తి శర్మ.
దీప్తి శర్మ.. టీమిండియా వుమెన్స్ టీమ్ లో నిఖార్సైన ఆల్ రౌండర్ గా పేరొందింది. కొన్ని నెలల క్రితం ఇంగ్లాండ్ పై మన్కడింగ్ చెయ్యడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది దీప్తి శర్మ. ఇక తాజాగా జరుగుతున్న ఐసీసీ వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీలో కూడా సత్తా చాటుతోంది దీప్తి శర్మ. పరిస్థితులకు తగ్గట్లుగా ఇటు బ్యాటింగ్ తోనూ అటు బౌలింగ్ తోనూ రాణిస్తుంటుంది. అయితే వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో మూడు వికెట్లు తీసి విండిస్ ను కట్టడిచెయ్యడంలో కీలక పాత్రం పోషించింది.
History: Deepti Sharma becomes the first Indian bowler to complete 100 wickets in T20I.
— Johns. (@CricCrazyJohns) February 15, 2023
విండీస్ జట్టులో నేలకూలిన 6 వికెట్లలో 3 వికెట్లను దీప్తి శర్మనే పడగొట్టడం విశేషం. దీప్తి శర్మ దెబ్బకి విండీస్ వుమెన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 118 పరుగులకే కట్టడి అయ్యింది. అయితే ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తియ్యడం ద్వారా టీమిండియా మహిళల తరపున దీప్తి శర్మ ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది. అదేంటంటే మహిళల అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు తీసిన భారత మహిళా బౌలర్ గా చరిత్ర సృష్టించింది. 89 మ్యాచ్ ల్లో ఈ ఘనత సాధించింది దీప్తి శర్మ. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్ 20 ఓవర్లలో 118 పరుగులు చేయగా.. జట్టులో స్టెఫానీ టేలర్ (42), క్యాంప్ బెట్ (30) పరుగులతో టాప్ స్కోరర్లు గా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4 ఓవర్లు వేసి కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది.
అనంతరం 119 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వుమెన్స్ జట్టు ప్రస్తుతం 5 ఓవర్లకు 35/2 పరుగులతో విజయం వైపు వెళ్తోంది. క్రీజ్ లో డాషింగ్ బ్యాట్స్ వుమెన్ షెఫాలీ వర్మ(22), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(0) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అవుటైన వారిలో స్మృతి మంథనా(10), రోడ్రిగ్వేజ్(1) ఉన్నారు. మరి టీ20ల్లో 100 వికెట్లు పడగొట్టి రికార్డు నెలకొల్పిన దీప్తి శర్మపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Deepti Sharma becomes the leading wicket taker for India in T20I history. pic.twitter.com/gTh4DAGYCs
— Johns. (@CricCrazyJohns) February 15, 2023