దీప్తి శర్మ.. టీమిండియా వుమెన్స్ టీమ్ లో నిఖార్సైన ఆల్ రౌండర్ గా పేరొందింది. కొన్ని నెలల క్రితం ఇంగ్లాండ్ పై మన్కడింగ్ చెయ్యడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది దీప్తి శర్మ. తాజాగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది ఈ మహిళా క్రికెటర్.