టీమిండియా క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ దీపక్ చాహర్ ప్రస్తుతానికి జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వెన్నెముక గాయం నుంచి ఇప్పుడే కోలుకుంటున్నాడు. మరో నాలుగు నెలల విశ్రాంతి సమయం తర్వాత జట్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం తనకున్న ఖాళీ సమయాన్ని దీపక్ చాహర్ కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా దీపక్ చాహర్ పెట్టిన ఒక వీడియో పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీపక్ కు జూన్ 2న ఆగ్రాలో తన ప్రేయసి జయా భరద్వాజ్ ను అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు దీపక్ చాహర్ తన పెళ్లికి సంబంధించి పెట్టిన పోస్టు నెట్టింట నవ్వులు పూయిస్తోంది.
విషయం ఏంటంటే.. దీపక్ చాహర్ తన పెళ్లికి సంబంధించిన ఒక వీడియో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అది అతని పెళ్లి సమయంలో సంగీత్ కు సంబంధించిన వీడియోలా ఉంది. అందులో దీపక్ తన భార్య జయా భరద్వాజ్ తో కలిసి ‘అకేలా హే మిస్టర్ ఖిలాడీ.. మిస్ ఖిలాడీ చాహియే’ అనే బాలీవుడ్ క్లాసిక్ కు ఇద్దరూ కలిసి స్టెప్పులేశారు. అయితే ఆ పోస్టుకు దీపక్ పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ సంగీత్ కు సంబంధించి ‘క్రికెట్ మ్యాచ్ కన్నా ఎక్కువ ఒత్తిడికి గురయ్యాను’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. అయితే అప్పుడే దీపక్ చాహర్ కు పెళ్లిపై క్లారిటీ వచ్చేసిందంటూ కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. దీపక్ చాహర్ డాన్స్ పర్ఫార్మెన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.