ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ శ్రీలంక 2022లో భాగంగా జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో శ్రీలంక అద్భుతంగా రాణిస్తోంది. తొమ్మిదేళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై వరుసగా రెండు వన్డేలు గెలిచింది. తొలి వన్డేని ఆస్ట్రేలియా నెగ్గగా తర్వాతి రెండు వన్డేల్లో శ్రీలంక అద్భుత విజయాలను నమోదు చేసింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. 292 భారీ లక్ష్యాన్ని శ్రీలంక బ్యాటర్లు 48.3 ఓవర్లలోనే ఛేదించి ఔరా అనిపించారు. పతుమ్ నిస్సాంక అద్భుత శతకం(147 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 137 పరుగులు)తో రాణించాడు. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించి ఫలితం గురించి కాకుండా... అంపైర్ కుమార్ ధర్మసేన పేరు బాగా వైరల్ అవుతోంది. అయితే అందుకు కారణం కూడా ఉందిలెండి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 36వ ఓవర్ వేసేందుకు శ్రీలంక బౌలర్ చమీరా వచ్చాడు. రెండో బంతిని వేసిన సమయంలో జిమ్ కారే దానిని డిఫెండ్ చేశాడు. ఆ బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని కాస్త గాల్లోకి లేచి.. లైన్ మీదున్న అంపైర్ కుమార్ ధర్మసేన వైపు వెళ్లింది. Kumar Dharmasena going for a catch in SL vs Aus Odi match pic.twitter.com/DYyxn6kEsy — Sportsfan Cricket (@sportsfan_cric) June 20, 2022 అతని వైపు వస్తున్న బాల్ ని క్యాచ్ చేయబోతున్నట్లు కుమార్ ధర్మసేన చేతులు గాల్లోకి పెట్టాడు. అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంపైర్ కుమార్ ధర్మసేన దానిని పట్టుకోలేదులెండి. నిజానికి అలా చేస్తే అది క్రికెట్ లో పెద్ద వివాదానికే తెర లేపేది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వైరల్ వీడియో చూసి నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మావా నువ్వు అంపైర్‌వి.. ఫీల్డర్ కాదు గుర్తుందా అంటూ మీమ్స్ చేస్తున్నారు. తాను అలా చేయాలనుకున్న తర్వాత కుమార్ ధర్మసేన కూడా ఎంతో నవ్వుకున్నాడు. కుమార్ ధర్మసేన బాల్ క్యాచ్ చేసేందుకు చూడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: ఫ్యాన్స్ కు కొడుకుని పరిచయం చేసిన యువరాజ్ సింగ్! ఇదీ చదవండి: గ్రౌండ్ స్టాఫ్ ని అవమానించిన రుజురాజ్! వెలుగులోకి రైనా గొప్పతనం!