టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందం ఇంగ్లండ్‌కు ఆరువారాల పాటు కూడా లేకుండా చేస్తోంది ఆస్ట్రేలియా. వరల్డ్ కప్ ముగిసిన ఐదు రోజులకే ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమైన ఇంగ్లండ్ అత్యంత దారుణ ప్రదర్శనను కనబరుస్తోంది. టీ20 వరల్డ్ ఛాంపియన్స్ టీమేనా ఆడేది అనే అనుమానం కలిగేలా చిత్తుచిత్తుగా ఓడుతుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే తొలి రెండు వన్డేలు ఓడిన ఇంగ్లండ్.. కనీసం చివరి వన్డేలో అయినా గెలిచి పరువు నిలబెట్టుకుంటుదని భావించిన సగటు క్రికెట్ అభిమానికి నిరాశ మిగిలిస్తూ.. ఆసీస్ ఓపెనర్ల చేతిల్లో చావుదెబ్బ తింటోంది. 38 ఓవర్లు పూర్తి అయ్యే సరికి ఆసీస్ ఓపెనర్లు 269 పరుగులు బాదేశారు. ఇద్దరు ఓపెనర్లు ట్రెవీస్ హెడ్, డేవిడ్ వార్నర్ సెంచరీలతో కదం తొక్కడంతో ఆసీస్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.
ఈ ఇద్దరూ ఆటగాళ్లు ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సులతో సందు దొరికితే పరుగుల వరద పారించారు. ఓపెనింగ్ జోడిని విడదీసేందుకు ఇంగ్లండ్ బౌలర్లను చేయని ప్రయత్నం లేదు. ఎన్ని రకాల బంతుల వేసినా.. ఫలితం లేకుండా పోయింది. 27వ ఓవర్లో ట్రెవీస్ హెడ్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 92 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసుకుని.. అదరగొట్టాడు. ఇక డేవిడ్ భాయ్ మాత్రం.. కాస్త నిదానంగా ఆడినా.. ఓలీ స్టోన్ వేసిన 37వ ఓవర్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 97 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద భారీ సిక్స్‌తో వార్నర్ తన స్టైల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇలా ఇద్దరు ఓపెనర్లు చెలరేగి ఆడి.. ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోశారు.
కానీ.. ఓలీ స్టోన్ అద్భుతంగా ఆడుతున్న ఓపెనింగ్ జోడీని ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. అతను వేసిన ఇన్నింగ్స్ 39వ ఓవర్ తొలి బంతికి డేవిడ్ వార్నర్ విల్లేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 102 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 106 పరుగులు చేసి వార్నర్ అవుట్ అయ్యాడు. అదే ఓవర్ నాలుగో బంతికి 130 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సులతో 152 పరుగులు చేసిన ట్రెవీస్ హెడ్ స్టోన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఎట్టకేలకు ఇంగ్లండ్ ఆసీస్ ఓపెనింగ్ జోడీని అడ్డుకుంది. కానీ.. వన్‌డౌన్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్ సైతం భీకర ఫామ్‌లో ఉండటం.. ఇంగ్లండ్ కష్టాలను మరింత పెంచనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోతే.. వరల్డ్ కప్ గెలిచిన నాలుగు రెండు వారాల్లోనే క్లీన్‌స్వీప్ మూటగట్టుకోనుంది. అయితే 42.2 ఓవర్ల తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. వర్షం తగ్గితే మళ్లీ ఆట మొదలవనుంది.
🌟 David Warner – 106 (102)
🌟 Travis Head – 152 (130)Outstanding innings from both the Australian openers come to an end.@davidwarner31 | @travishead34 | #AUSvENG pic.twitter.com/HQumLRwYq9
— CricTracker (@Cricketracker) November 22, 2022