‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’లో న్యూజిలాండ్ ఫైనల్ చేరింది. సెమీస్-1లో న్యూజిలాండ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో పరాభవానికి రివేంజ్ తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి.. 166 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ మంచి లక్ష్యాన్నే కివీస్ ముందు ఉంచినా.. మిట్చెల్, నీషమ్ మెరుపు బ్యాటింగ్ ఎదుట అది చిన్నబోయింది. ఒక ఓవర్ మిగిలుండగానే కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. ఐదు వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసి.. ఫైనల్ చేరింది.
A #T20WorldCup night to remember in Abu Dhabi for Daryl Mitchell! pic.twitter.com/ye8wZFOR2p
— T20 World Cup (@T20WorldCup) November 10, 2021
కివీస్ భారీ లక్ష్య ఛేదనకు దిగగానే.. మార్టిన్ గప్టిల్ బౌండిరీతో ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. కానీ, క్రిస్ వోక్స్ వేసిన బంతికి క్యాచ్ ఔట్ గా పెవిలియన్ చేరాడు. తర్వాత 2.4 ఓవర్‌లో కెప్టెన్ కేన్ విలియమ్స్(5) కూడా ఔట్ కావడంతో కివీస్‌పై ఒత్తిడి అధికమైంది. 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. డిఫెన్స్‌లో పడిపోయారు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కాన్వే, మిట్చెల్‌లు కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు కొనసాగించారు. వీలైన బంతిని బౌండిరీకి తరలిస్తూ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. పవర్ ప్లే ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 36 పరుగులు చేశారు. తర్వాత ఆ జోడీ క్రీజులో పాతుకు పోయారు. మూడో వికెట్ తీయడానికి ఇంగ్లాండ్‌కు చాలా సమయమే పట్టింది. 13.4 ఓవర్‌లో లివింగ్ స్టోన్ బాల్‌కు కాన్వే(46) పెవెలియన్ చేరాడు. తర్వాత వచ్చిన ఫిలిప్ వెంటనే వెనుదిరిగాడు. దాంతో మళ్లీ కివీస్ కాస్త ఒత్తిడిలో పడింది.
OTTNO 😤 Huge team effort from the lads!
Catch the match highlights now on Spark Sport#SparkSport #T20WorldCup @BLACKCAPS pic.twitter.com/SbzO2z1Pfo
— Spark Sport (@sparknzsport) November 10, 2021
క్రీజులోకి వచ్చిన నీషమ్ ఆడింది 11 బంతులే అయినా.. ఇంగ్లాండ్ బౌలర్లను కంగారు పెట్టాడు. 3 భారీ సిక్సులు, ఒక బౌడరీ సాయంతో 26 పరుగులు చేశాడు. నీషమ్ కొట్టిన సిక్సులతో ఆట స్వరూపమే మారిపోయింది. మ్యాచ్ మొత్తం న్యూజిలాండ్ వైపు తిరిగింది. తర్వాత నీషమ్ ఔటైనా.. మిట్చెల్ మాత్రం ధాటిగా ఆడాడు. 19వ ఓవర్‌లో రెండు సిక్సులు, ఒక బౌండిరీతో మ్యాచ్‌ను న్యూజిలాండ్ వశం చేశాడు మిట్చెల్. వెరసి న్యూజిలాండ్ ఫైనల్ చేరింది. 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ పరాభవం రివేంజ్‌ను తీర్చుకుంది న్యూజిలాండ్.
Let @dazmitchell47 take you out to the middle in Abu Dhabi during his @T20WorldCup semi-final defining partnership with @JimmyNeesh. #T20WorldCup pic.twitter.com/IsvHBeoVOb
— BLACKCAPS (@BLACKCAPS) November 11, 2021