టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మ్యాచ్ గురించి మంచి ఎనాలసిస్ ఇస్తాడు కానీ.. మ్యాచ్ ప్రిడిక్షన్‌లో మాత్రం దారుణంగా విఫలం అవుతాడు. అతని నోటి మాట పవరో ఏమో కానీ.. అతను ఏ జట్టు గెలుస్తుందని చెప్తాడో ఆ టీమ్ కచ్చితంగా ఓడిపోతుందని అభిమానులు చెప్తుంటారు. ఐపీఎల్ 2022లో అనేక సార్లు అలాగే జరిగింది. సరే ఐపీఎల్ కదా.. అన్ని జట్లు స్ట్రాంగ్‌గానే ఉంటాయి. ఏ టీమ్ ఎప్పుడు గెలుస్తుందో చెప్పలేం అనుకోవచ్చు. కానీ.. తాజాగా టీ20 వరల్డ్ కప్ 2022 సందర్భంగా గంభీర్ మెచ్చుకోవడమే ఒక ఛాంపియన్ టీమ్‌కు శాపంగా మారిందంటూ సోషల్ మీడియాలో గంభీర్‌పై దారుణమైన మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ ఏ టీమ్‌కు గంభీర్ పొగడ్త శాపంగా మారిందంటే.. శ్రీలంకకు. ఇటివల టీమిండియా, పాకిస్థాన్ లాంటి పెద్ద జట్లను మట్టికరిపించి ఆసియా కప్ 2022 ఛాంపియన్‌గా నిలిచిన శ్రీలంక ఎంతో ఉత్సహం, ఆత్మవిశ్వాసంతో టీ20 వరల్డ్ కప్‌కు సిద్దమైంది. పైగా వరల్డ్ కప్ పోటీలు తమ మ్యాచ్‌తోనే ప్రారంభం కానుడటంతో మంచి గెలుపుతో టోర్నీ ఆరంభిద్దామని ఆశించారు. కానీ.. దారుణంగా పసికూన నమీబియా చేతిలో ఓడిపోయారు. అది కూడా అత్యంత హోరంగా.. తొలుత బౌలింగ్‌లో విఫలం ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఫెయిలై.. ఏకంగా 55 పరుగులతో చిత్తుచిత్తుగా ఓడారు. వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లోనే భారీ సంచలనం నమోదైంది. ఈజీగా గెలుస్తారనుకున్న మ్యాచ్‌లో లంకేయులు ఓడి ప్రపంచ క్రికెట్‌కు షాకిచ్చారు.
అయితే ఇదంతా.. గంభీర్ చలవే అంటున్నారు నెటిజన్లు. ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంక వరల్డ్ కప్ అవకాశాలపై స్పందించిన గంభీర్. ‘ఆసియా కప్ 2022 గెలిచి శ్రీలంక టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు వస్తుంది. దీంతో వాళ్లు పక్కా ప్లాన్ ప్రకారమే వరల్డ్ కప్‌కు వస్తారు. శ్రీలంక జట్టు తమ పూర్వవైభవాన్ని మళ్లీ అందుకునేలా కనిపిస్తుంది. దుస్మంత చమీరా, లహిరు కులశేఖర రాకతో లంక టీమ్ మరింత పటిష్టంగా తయారైంది. నా అంచనా ప్రకారం టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంక ఫెవరెట్ జట్లకు కచ్చితంగా షాక్ ఇస్తుంది. ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్‌ను శ్రీలంక ఓడించిన విషయాన్ని మర్చిపోవద్దు.’ అని గంభీర్ పేర్కొన్నాడు. గంభీర్ ఇలా అన్నాడో లేదో.. నమీబియా చేతుల్లో శ్రీలంక ఓడింది. దీంతో గంభీర్ మరోసారి సోషల్ మీడియాలో మీమ్ ట్రోలింగ్ జరుగుతోంది.
Gambhir before Asia Cup ” there are 0% chances of Sri Lanka winning Asia Cup”
*Result – Sri Lanka won Asia CupGambhir before 2022 T20WC
“Sri Lanka is one of the favourite to win T20WC”
*Result – Namibia beat Sri Lanka in 1st game 😂😂 pic.twitter.com/c5K1NPc27h— Bhatti Sahb💞 (@BhattiS69920373) October 16, 2022
Former India batter Gautam Gambhir rates Asian Champions Sri Lanka as a potential threat ahead of the T20 World Cup 2022.#T20WorldCup | #GautamGambhir | #CricketTwitter https://t.co/gd3FTAOcSn
— CricTracker (@Cricketracker) October 15, 2022