టీ20 వరల్డ్ కప్ 2022లో తొలి రోజే సంచలనం నమోదైంది. తొలి మ్యాచ్‌లో నమీబియా శ్రీలంకను ఓడించి చరిత్ర సృష్టించింది. 55 పరుగులతో అద్భుతమై విజయం సాధించిన నమీబియా టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 12 ఆడేందుకు తమ అవకాశాలను మరింత మెరుపుపర్చుకుంది. ఇక తర్వాతి మ్యాచ్‌లో నెథర్లాండ్స్‌తో యూఏఈ తలపడింది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో నెథర్లాండ్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాదాపు చివరి 20 బంతుల్లో 20 పరుగులు కావాల్సిన దశలో యూఏఈ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినా.. ఫీల్డింగ్ తప్పిదాలతో యూఏఈ మూల్యం చెల్లించుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 111 పరుగుల స్వల్ప స్కోర్ చేసింది. మొహమ్మద్ వసీమ్ 41 పరుగులతో రాణించాడు. మంచి కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నెథర్లాండ్స్ బౌలర్లు యూఏఈ బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేశారు. ఇక 112 పరుగుల లక్ష్యఛేదనను నెథర్లాండ్స్ ఒక బంతి మిగిలిఉండగా.. 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యూఏఈ బౌలర్లలో జూనైద్ సిద్ధిఖీ 3 వికెట్లతో రాణించాడు. ఈ విజయంతో నెథర్లాండ్స్ తన సూపర్ 12 అవకాశాలను మెరుగుపర్చుకుంది.
ఇక ఈ మ్యాచ్‌లో యూఏఈ తరఫున బరిలోకి దిగిన అయాన్ అఫ్జల్ ఖాన్ రికార్డు సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న అతి పిన్న వయస్కుడిగా అయాన్ చరిత్ర సృష్టించాడు. 16 ఏళ్ల అయాన్ కేవలం 3 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల అనుభవంతో టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికయ్యాడు. ఆల్‌రౌండర్ అయిన అయాన్ ఈ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. బ్యాటింగ్‌లో 7 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే బౌలింగ్‌లో 3 ఓవర్లు వేసి 15 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టి పర్వాలేదనిపించాడు. ఇక.. అయాన్ ఖాన్ అవుటై పెవిలియన్ వెళ్తున్న క్రమంలో బౌండరీలైన్ కాళ్లకు తగిలి కుప్పకూలాడు. వెంటనే లేచి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. అవుటై భాదలోనో లేక వెంటనే బౌలింగ్ రావాలనే హడావుడిలోనూ బౌండరీ లైన్ దాటుతున్న సమయంలో తన కాళ్లు రోప్‌కు తగిలి ఒక్కసారిగా కిందపడ్డాడు. అయాన్ కిందపడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
🤣🤣🤣 pic.twitter.com/Q3IxOFwdPb
— England’s Barmy Army (@TheBarmyArmy) October 16, 2022