2020, 2021 లో కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచ మొత్తం దారుణ పరిస్థితులను చూసింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. కరోనా సమయంలో అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. అందుకు క్రీడా రంగం కూడా అతీతం కాదు. అందులోనూ క్రికెట్ మ్యాచ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. కరోనా తగ్గుమొఖం పట్టిన తర్వాత కూడా ఖాళీ స్టేడియాలు దర్శనం ఇచ్చాయి. ఆటగాళ్లు బయోబబుల్, క్వారంటైన్, ఐసోలేషన్‌తో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇక కరోనా టెస్టులో క్రికెటర్‌కు పాజిటివ్ వస్తే.. ఎంత ముఖ్యమైన మ్యాచ్ అయినా.. ఆడకుండా చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆటగాళ్లు క్రికెట్ ఆడారు. కొన్ని సార్లు కరోనా పుణ్యమా అని స్టార్ క్రికెటర్లు దూరమై జట్లు బలహీనపడి.. మ్యాచ్‌లు పొగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితి ఆస్ట్రేలియా వేదికగా జరగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022కు రాకుండా ఉండేందుకు ఐసీసీ నిబంధనలను సవరించింది. ఇక ఆటగాళ్లుకు కోవిడ్ టెస్టులో పాజిటివ్ వస్తే.. వారిని ఐసోలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కరోనా పాజిటివ్ వచ్చిన క్రికెటర్ కూడా మ్యాచ్ ఆడేందుకు ఐసీసీ అనుమతి ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఈ నిబంధనతో కరోనా వచ్చి.. లక్షణాలు లేని ఆటగాళ్లతో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాగా.. టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లోనే నమీబియా శ్రీలంకకు షాకిచ్చింది. 55 పరుగుల తేడాతో విజయం సాధించి.. వరల్డ్ కప్ ప్రారంభరోజునే సంచలనం సృష్టించింది.
ICC has relaxed the COVID-19 protocols 🏏
📸: Getty Images#t20 #t20worldcup #crickettwitter pic.twitter.com/9ItoiscYBe
— Sportskeeda (@Sportskeeda) October 16, 2022