గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ‘టీ20 వరల్డ్ కప్ 2021’లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అందరకి గుర్తుండే ఉంటుంది. ఈ మ్యాచులో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది. ఈ మ్యాచులో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం పాకిస్తాన్ పాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ.. భారత టాప్ 3 బ్యాట్స్‌మెన్ వికెట్లు తీసిన అఫ్రిది.. ఆ మ్యాచులో భారత్ ను కోలుకోలేని దెబ్బతీశాడు.ఈ మ్యాచులో అఫ్రిదీ 4 ఓవర్లు ఎదుర్కోవడానికి భారత బ్యాటర్లు తెగ ఇబ్బందిపడ్డారు. అయితే.. భారత టెస్టు బ్యాట్స్‌మెన్ పూజారా మాత్రం అఫ్రిది బౌలింగ్‌ను ఈజీగా ఫేస్ చేయడమే కాదు, బౌండరీలు బాది పాక్ కుర్ర బౌలర్‌ను ఎలా ఆడాలో భారత టాప్ బ్యాటర్లను పాఠాలు నేర్పించాడు.
కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్ తరుపున ఆడుతున్న ఛతేశ్వర్ పూజారా మాత్రం షాహీన్ ఆఫ్రిది బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కున్నాడు. అఫ్రిదీ బౌలింగ్‌లో అప్పర్ కట్ సిక్సర్ బాది, క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపోయేలా చేశాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
An upper cut six by Pujara against Shaheen Afridi in county. pic.twitter.com/S98IzbIpEA
— Johns. (@CricCrazyJohns) May 7, 2022
Pujara VS Afridi 🇮🇳pic.twitter.com/3BhWempttX
— Sushant Mehta (@SushantNMehta) May 8, 2022
ఇది కూడా చదవండి: Virat Kohli: ముచ్చటగా మూడోసారి ‘కోహ్లీ డకౌట్’.. ఇక దేవుడే కాపాడాలి!
టీమిండియా తరుపున గత మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోయిన ఛతేశ్వర్ పూజారా.. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో మాత్రం సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఆడిన 4 మ్యాచుల్లో రెండు సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు చేసాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటికే 531 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.