జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన టీమిండియా ఆటగాళ్లు ఒక్కొక్కరిగా ఇంగ్లాండ్ కౌంటీల్లో అరంగ్రేటం చేస్తున్నారు. మళ్ళీ దారిలోకి రావాలన్నా, మా ప్రదర్శన చూడు ఎంత గొప్పగా ఉందో అని సెలెక్టర్లకు చూపించాలన్నా, అక్కడ రాణించడమే తరువాయి. ఒకవేళ పుంజుకున్నారో అదృష్టం వరించడమే. ఎందుకంటే.. పేస్ పిచులకు వేదికలైన ఇంగ్లాండ్ పిచ్ లపై ఇండియా బౌలర్లు రాణించలేరు అన్న పేరుంది. ఈ తరుణంలో రాణించారంటే.. సెలెక్టర్ల దృష్టిలో పడినట్లే. అలాంటి అద్భుతమైన ప్రదర్శన చేసాడు.. టీమిండియా యువ బౌలర్. […]
కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ 1లో కెంట్ తో జరిగిన మ్యాచ్ లో లంకషైర్ 184 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవలే 5 వికెట్ల ప్రదర్శన చేసిన సుందర్.. ఈ మ్యాచ్ లోనూ అద్భుతంగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో వికెట్ తీయలేకపోయినా.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 3 వికెట్లతో మెరిశాడు. అంతేకాకుండా.. వాషింగ్టన్ సుందర్ వేసిన ఓ బంతికి జోర్డాన్ కాక్స్ బౌల్డ్ అయ్యాడు. […]
ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ నార్త్ఈస్ట్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 400 పైచిలుకు పరుగులు చేసిన రెండో క్రికెటర్ గా, మొట్టమొదటి ఇంగ్లాండ్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. శనివారం లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో సామ్ నార్త్ఈస్ట్ ఈ రికార్డు అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్ కు ఆదరణ తగ్గుతుందన్న వార్తలు వస్తున్న ఈరోజుల్లో.. ఈ ఇన్నింగ్స్ టెస్టు క్రికెట్ కు ప్రాణం పోసినట్లయ్యింది. సామ్ నార్త్ఈస్ట్(450 బంతుల్లో 410 పరుగులు) ప్రభంజనంతో.. గ్లామోర్గాన్ 5 […]
క్రీడా ప్రపంచంలో కొందరు ఆటగాళ్లు వన్టేల్లో.. మరికొందరు టీ20ల్లో.. ఇంకొందరు టెస్టుల్లో తమదైన ముద్ర వేస్తూ ఉంటారు. అలా భారత టెస్టు క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆటగాడు ఛతేశ్వర్ పుజారా.. తన ఆటతో ‘నయా వాల్ ఆఫ్ ఇండియాగా’ పిలవబడుతున్నాడు. ప్రస్తుతం టీంఇండియా టీ20లు, వన్టే సిరీస్ లతో బిజీగా ఉంది. దీంతో తాజాగా ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడుతున్న పుజార అరుదైన రికార్డ్ సాధించాడు. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు భారత […]
గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ‘టీ20 వరల్డ్ కప్ 2021’లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అందరకి గుర్తుండే ఉంటుంది. ఈ మ్యాచులో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది. ఈ మ్యాచులో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం పాకిస్తాన్ పాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ.. భారత టాప్ 3 బ్యాట్స్‌మెన్ వికెట్లు తీసిన అఫ్రిది.. ఆ మ్యాచులో భారత్ ను కోలుకోలేని దెబ్బతీశాడు.ఈ మ్యాచులో […]
గాయం కారణంగా క్రికెట్‌కు దూరమైన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అదిరిపోయే రీతిలో రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడుతున్న బెన్ స్టోక్స్ తన విశ్వరూపం చూపించాడు. ఒకే ఓవర్ లో 34 పరుగులు కొట్టి 18 ఏళ్ల కుర్రాడిని బిత్తరపోయేలా చేశాడు. ఈ క్రమంలో 64 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్ లో డర్హమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టోక్స్ వోర్సెస్టర్‌షైర్‌పై ఈ ఫీట్ నమోదు చేశాడు. ఆరు బంతుల్లో […]
టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చటేశ్వర్ పుజారా లండన్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్ షిప్‌లో అదరగొడుతున్నాడు. మూడు వరుస మ్యాచ్‌ల్లోనూ సెంచరీలతో చెలరేగాడు. తొలి మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచిన పుజారా.. తర్వాతి రెండు మ్యాచ్‌లలోనూ సెంచరీలతో కదం తొక్కాడు. పూర్ ఫామ్‌తో టీమిండియా స్థానంలో కోల్పోయిన పుజారా.. కౌంటీ క్రికెట్‌లో ఈ ఏడాది తొలిసారి అడుగుపెట్టాడు. ససెక్స్ జట్టు తరుపున ఆడుతున్న పుజారా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 201(నాటౌట్), 109, 128(నాటౌట్).. ఇవి […]