డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు టీమిండియా వెటరన్ ప్లేయర్ చటేశ్వర్ పుజారా. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న ఈ స్టార్ ప్లేయర్ సెంచరీతో సత్తా చాటాడు.
టీమిండియా వెటరన్ ప్లేయర్, టెస్టు స్పెషలిస్ట్, నయావాల్ చటేశ్వర్ పుజారా ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన టెస్టు సిరీస్ లో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న ఈ నయా వాల్ మీద సెలక్టర్లు ఎట్టకేలకు కఠిన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎన్నో సంవత్సరాలు జట్టులో రెగ్యులర్, కీలక ప్లేయర్ గా కొనసాగుతున్న పుజారాకు ఊహించన షాక్ ఇచ్చారు. 35 సంవత్సరాల ఈ వెటరన్ ప్లేయర్ ఇక టెస్టు జట్టులో సంపాదించడం దాదాపు అసాధ్యంగా భావించారు. అయితే పుజారా మాత్రం ఆ నమ్మకం కోల్పోలేదు. ఖచ్చితంగా జట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. డొమెస్టిక్ క్రికెట్ లో సెంచరీ బాదేశాడు. తాజాగా ఇంగ్లాండ్ లో జరుగుతున్న వన్డే కప్ లో భాగంగా సెంచరీతో దుమ్మురేపి మరోసారి టీమిండియా తలుపులు తట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు.
భారత టెస్టు జట్టులో ఒక్కసారి చోటు కోల్పోతే తిరిగి రావడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విపరీతమైన కాంపిటీషన్ ఉన్న కారణంగా అవకాశం వస్తే నిరూపించుకోవాలని చాలా మంది సిద్ధంగా ఉన్నారు. కానీ పుజారా కంబ్యాక్ మాత్రం ఇంత సాలిడ్ గా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ఈ స్టార్ ప్లేయర్ ఫామ్ చూస్తుంటే అసలు ఎందుకు జట్టులో నుంచి తొలగించారని సందేహం కూడా వస్తుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న పుజారా రాయల్ లండన్ వన్డే కప్‌లో భాగంగా ససెక్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శుక్రవారం సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. 113 బంతుల్లో 11 ఫోర్లతో 117 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన పుజారా.. ససెక్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో పుజారాకు ఇదో రెండు సెంచరీ కావడం గమనార్హం. పుజారా సెంచరీతో 319 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని అలవోకగా ఛేజ్ చేసింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
“నేను ఎక్కడ ఆడినా వంద శాతం ప్రదర్శన కనబరుస్తాను. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తాను. భారత్ మరో మూడు నెలల పాటు టెస్టు క్రికెట్ ఆడే అవకాశం లేదు. డిసెంబర్ లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ లో చోటు సంపాదించడమే నా లక్ష్యం. తిరిగి జట్టులోకి రావడానికి సాయ శక్తులా ప్రయత్నిస్తాను”. అని పుజారా చెప్పుకొచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ల్లో రెండు ఇన్నింగ్స్ ల్లో పుజారా ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఓ వైపు భారత్ ప్లేయర్లందరూ ఐపీఎల్ ఆడుతుంటే పుజారా మాత్రం కౌంటీల్లో సత్తా చాటి టీమిండియా అభిమానుల్లో అంచనాలను పెంచేసాడు. కానీ ఈ నయా వాల్ మాత్రం తన చెత్త బ్యాటింగ్ తో అందరినీ నిరాశపరిచాడు. మొత్తానికి జట్టులో చోటు సంపాదించుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్న పుజారాను సెలక్టర్లు కరుణిస్తారో లేదో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
A superstar indeed, @tregs140 🌟
Cheteshwar Pujara is just inevitable.#MBODC23 pic.twitter.com/lG7Tfxx8gg
— Metro Bank One Day Cup (@onedaycup) August 11, 2023