టీమిండియా తలుపులు మూసుకుపోతున్న తరుణంలో యువ ఓపెనర్ పృథ్వీ షా ఒక్క సంచలన ఇన్నింగ్స్ తో ఏకంగా వరల్డ్ కప్ రేస్ లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో షా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ఓ వైపు ఆటతో, మరో వైపు మాటలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఇంగ్లాండ్ వన్డే కప్ లో భాగంగా జరుగుతున్న టోర్నీలో షా తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగిన సంగతి తెలిసిందే. నార్తాంప్టన్‌షైర్ జట్టు తరపున ఆడుతున్న షా.. సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 153 బంతుల్లోనే 28 ఫోర్లు, 11 సిక్సులతో ఏకంగా 244 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడి తనపై వస్తున్న విమర్శకులకు బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. షా ఇన్నింగ్స్ ని చూస్తుంటే త్వరలో స్వదేశంలో జరగబోయే వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయిన ఆశ్చర్యపడనవసరం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గిల్ ఫామ్ లేమితో ఇబ్బంది పడడం, కిషాన్ కూడా ఆశించినంత స్థాయిలో రాణించకపోవడం షా కి కలిసి వచ్చే అంశం. ఈ నేపథ్యంలో ఈ ముంబై బ్యాటర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
పృథ్వీ షా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 18 ఏళ్ళ వయసులోనే జాతీయ జట్టులో ప్రవేసింది అరంగ్రేట మ్యాచులోనే సెంచరీ బాదేశాడు. దీంతో ఫ్యూచర్ స్టార్ గా కితాబులందుకొని అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు. అయితే ఆ తర్వాత గాడి తప్పిన షా కెరీర్ క్రమంగా దిగజారుతూ వచ్చింది. అతి విశ్వాసం, దురుసు ప్రవర్తన కారణంగా అందరి ప్రశంసించిన వారే విమర్శించారు. అయితే తాజాగా షా బౌన్స్ బ్యాక్ అయిన విధానం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో ఏకంగా వరల్డ్ కప్ రేస్ లోకి దూసుకొచ్చాడు. అయితే సరిగ్గా ఇలాంటి సమయంలో షా సంచలన గతంలో తనను కారణం చెప్పకుండా పక్కన పెట్టారనే వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
“పృథ్వీ షా” మాట్లాడుతూ ” ఫిట్‌నెస్ లేని కారణంగా నన్ను పక్కన పెట్టారని కొంతమంది నాతో చెప్పారు. కానీ నేను నేషనల్ క్రికెట్ అకాడమీలో అన్ని పరీక్షలు పాసయ్యాను. దాంతో పాటు దేశవాళీ క్రికెట్ లో కూడా నా ఫామ్ నిలకడగా ఉంది. విండీస్ టూర్ లో సెలక్ట్ అవుతానని భావించాను. కానీ సెలక్టర్లు నన్ను పట్టించుకోకపోవడం చాలా బాధని కలిగించింది. అయినా కూడా నేను నా పని చూసుకుంటూ వెళ్ళాను”. అని షా తన మనసులోని బాధను తెలియజేశాడు. షా చివరిసారిగా 2021 జులై 25న శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్ ఆడాడు ఆ తర్వాత మళ్లీ టీమిండియా తరపున ఆడే అవకాశం లభించలేదు. మరి పృథ్వీ షా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.