విండీస్ తో టీమిండియా వచ్చే నెల 12 నుంచి రెండు టెస్టు మ్యాచులు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత్ ఆడబోయే టెస్టు జట్టులో నయా వాల్ పుజారాకు సెలెక్టర్లు పెద్ద షాక్ ఇచ్చారు. అయితే పుజారాకు టెస్టు జట్టులో నుండి తప్పించినా అతనికి దారులు మూసుకుపోలేదని బీసీసీఐ చెప్పుకొచ్చింది.
ఇటీవలే పేలవ ఫామ్ తో ఉన్న పుజారా మీద సెలెక్టర్లు వేటు వేసిన సంగతి తెలిసందే. గత రెండేళ్లుగా అడపాదడపాగా ఆడుతూ కెరీర్ నెట్టుకొస్తున్న పుజారా.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఘోర ప్రదర్శన చేసాడు. ఇంగ్లాండ్ పిచ్ ల మీద కౌంటీ క్రికెట్ ఆడుతూ సెంచరీల మీద సెంచరీలు కొట్టిన పుజారా డబ్ల్యూటీసీ ఫైనల్లో మాత్రం కనీసం ఒక్క ఇన్నింగ్స్ లో కూడా 20 పరుగుల మార్క్ ని టచ్ చేయలేకపోయాడు. దీంతో పుజారాను ముందు నుంచే టెస్టు జట్టులో స్థానం దక్కదు అనే మాటలు వినిపిస్తున్నా.. సీనియర్ గా చివరి అవకాశం లభిస్తుందని ఊహించారు. కానీ అనుకున్నట్లుగా నే పుజారాకు టెస్టు జట్టు నుంచి ఉద్వాసన తప్పలేదు. అయితే పుజారాకు టెస్టు జట్టులో నుండి తప్పించినా అతనికి దారులు మూసుకుపోలేదని బీసీసీఐ చెప్పుకొచ్చింది.
విండీస్ తో టీమిండియా వచ్చే నెల 12 నుంచి రెండు టెస్టు మ్యాచులు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత్ ఆడబోయే టెస్టు జట్టులో నయా వాల్ పుజారాకు సెలెక్టర్లు పెద్ద షాక్ ఇచ్చారు. జట్టు నుండి తొలగిస్తూ అతని స్థానంలో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి యంగ్ ప్లేయర్లకు అవకాశమిచ్చింది. దీంతో పుజారాకు ఇక టెస్టు జట్టులో స్థానం దక్కడం కష్టమేనని భావించారు. ఒక్కసారి జట్టు నుండి ఉద్వాసనకు గురైన తర్వాత మళ్ళీ టీమిండియాలోకి పునరాగమనం చేయాలంటే అది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పుజారాపై రిటైర్మెంట్ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే దేశావళి క్రికెట్ ఆడితే పుజారా మళ్ళీ జట్టులోకి వస్తాడని బీసీసీఐ భరోసా ఇచ్చింది.
ఈ సందర్భంగా బీసీసీఐ అధికారుల్లో ఒకరు మాట్లాడుతూ..”యువ ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్ కాంబినేషన్‌ను ప్రయత్నించాలని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు సెలెక్టర్లు భావించారు. ఈ కారణంగానే పుజారాకు వెస్టిండీస్ పర్యటనలో చోటు దక్కలేదు. ద్రవిడ్, సెలెక్టర్లు గైక్వాడ్, జైస్వాల్‌కు అవకాశం ఇచ్చి చూడాలనుకున్నారు. ఈ విషయాన్ని పుజారాతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా అతనికి టీమిండియాకు ఆడే అవకాశం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటితే గతంలో మాదిరి మళ్లీ తిరిగి జట్టులో చేరవచ్చు. అని సదరు అధికారి పేర్కొన్నాడు. మరి పుజారా దేశావాలీ క్రికెట్ లో నిరూపించుకొని మళ్ళీ టీమిండియాలోకి అడుగుపెడతాడో లేదో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Dravid & Selectors wanted to try Jaiswal & Ruturaj, that is why Pujara is not picked for the WI tour, he has been communicated well and doors are not closed if he does well in domestics. [TOI] pic.twitter.com/LOURlyY5JH
— Johns. (@CricCrazyJohns) June 23, 2023