టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్నాడు. ససెక్స్ జట్టుకు స్టాండింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పుజారా డబుల్ సెంచరీ సాధించాడు. మిడిలెసెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 368 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో పుజారా డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ ఏడాది పుజారాకు ఇది మూడో డబుల్ సెంచరీ.
ఈ క్రమంలో పుజారా ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. 118 ఏళ్ల చరిత్రలో సింగిల్ కౌంటీ డివిజన్‌లో ససెక్స్ తరపున మూడు డబుల్ సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా పుజారా రికార్డులకెక్కాడు. ఈ ఏడాది ససెక్స్ తరపున డెర్బీషైర్‌తో మ్యాచ్‌లో తొలి డబుల్ సెంచరీ మార్క్ అందుకున్న పుజారా.. ఆ తర్వాత డుర్హమ్‌తో మ్యాచ్‌లో మరో డబుల్ సెంచరీ బాదాడు. తాజాగా మిడిలెసెక్స్‌తో మ్యాచ్‌లో ముచ్చటగా మూడో డబుల్ సెంచరీ సాధించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే పుజారా 231 పరుగులు చేసి ఔట్ కాగానే ససెక్స్ ఇన్నింగ్స్ 523 పరుగుల వద్ద ముగిసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన మిడిలెసెక్స్ వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో విఫలం కావడంతో పుజారా టీమిండియా చోటు కోల్పోయాడు. ఆ తర్వాత కౌంటీ క్రికెట్ ఆడేందుకు వెళ్లి ససెక్స్ తరపున సెంచరీలు, డబుల్ సెంచరీలతో చెలరేగాడు.
ఇంతకముందు మిడిలెసెక్స్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో 170 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన పుజారాకు ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టుకు టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ పుజారా రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో తన ఫామ్‌ను కొనసాగించాడు. మరి పుజారా కౌంటీల్లో ఆడుతున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Our highest-ever score at Lord’s and Pujara hits another double century. 🌟
Read all about day two against Middlesex. 📝 ⬇ #GOSBTS
— Sussex Cricket (@SussexCCC) July 20, 2022
Appreciation and clapping for Cheteshwar Pujara from Lord’s balcony.#pujara #INDvsWI pic.twitter.com/thzk3moxi6
— CRICKET VIDEOS🏏 (@Abdullah__Neaz) July 20, 2022
Third double-hundred of the county season for Cheteshwar Pujara 🔥#CountyChampionship
10 innings, 997 runs, 124.62 average, 5 Hundreds, 3 double hundred – PHENOMENAL.#pujara pic.twitter.com/dkId7WY85A
— The Cricket Gang (@TheCricketGang) July 20, 2022