టెస్ట్ క్రికెట్ బోరింగ్ గా భావించే ఈ రోజుల్లో అద్భుతమే జరిగింది. ఇంగ్లాండ్ లోని కౌంటీ క్రికెట్ ఈ గొప్ప మ్యాచ్ కి క్రికెట్ లవర్స్ కి అందించింది. భారీ లక్ష్యాన్ని కూడా అలవోకగా ఛేదించి ఔరా అనిపించింది. మరి ఆ మ్యాచ్ ఏంటి పూర్తి వివారాల్లోకెళ్తే..
టెస్టు క్రికెట్ బోర్ గా భావించే ఈ జెనరేషన్ లో కౌంటీ క్రికెట్ మంచి కిక్ ఇచ్చింది. టెస్టుల్లో ఛేజింగ్ చేయడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 300 స్కోర్ టార్గెట్ ఉన్నా.. వాటిని డిఫెండింగ్ చేసుకొని గెలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక 400 పరుగుల టార్గెట్ బోర్డు మీద కనిపిస్తే ఆశలు వదులుకోవాల్సిందే. కానీ ఒక జట్టు ఏకంగా 500 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సంచలనం సృష్టించింది. అయితే ఈ అద్భుతం జరిగింది టెస్టు క్రికెట్ లో కాదు కౌంటీ క్రికెట్ లో. దీంతో ఇప్పుడు కౌంటీ క్రికెట్ లో ఒక కొత్త రికార్డ్ చోటు చేసుకుంది. మరి ఆ మ్యాచ్ ఏంటి పూర్తి వివారాల్లోకెళ్తే..
ప్రస్తుతం ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సర్రే, కెంట్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో సర్రే జట్టు సంచలనం నమోదు చేసింది. కెంట్ విధించిన 500 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేజ్ చేసింది. ఐదవ రోజు అటు ముగిసే సమయానికి సర్రే విజయానికి 238 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. అంతకముందు మెరుపు సెంచరీతో జెమీ స్మిత్ కెంట్ బౌలర్లను ఒక ఆటాడుకున్నాడు. కేవలం 77 బంతుల్లోనే 114 పరుగులు చేసి జట్టుకు మంచి పునాది వేసాడు. ఇక చివరి రోజు సిబిలి, ఫోక్స్ చాలా జాగ్రత్తగా ఆడుతూ సర్రే జట్టుకి సంచలనమైన విజయాన్ని అందించారు. ఫోక్స్ 124 పరుగులు చేయగా.. మరో ఎండ్ లో సిబిలి 511 నిమిషాల పాటు గ్రీజ్ లో నిల్చొని 415 బంతుల్లో 140 పరుగులు చేసాడు.
దీంతో కౌంటీ క్రికెట్ లో సర్రే జట్టు రెండో అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతే కాదు గత 98 ఏళ్ళల్లో కౌంటీ క్రికెట్ లో 500 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ లిస్టులో నాట్స్ తో జరిగిన మ్యాచులో మిడిలెస్సెక్స్ 502 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఇప్పటికీ అగ్ర స్థానంలో కొనసాగుతుంది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఈ మ్యాచ్ 1925 లో జరిగింది. ఇక అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో ఈ రికార్డ్ వెస్టిండీస్ పేరిట నమోదయింది. మొత్తానికి 500 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ఔరా అనిపించినా సర్రే టీం గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
What an effort by Dom Sibley 👏
Sibs finishes 140 not out after batting for 146.1 overs 🤩
So good to have you home 🏡
🤎 | #SurreyCricket https://t.co/iJKxxiQJOt pic.twitter.com/5Wn4Fa7okE
— Surrey Cricket (@surreycricket) June 14, 2023