భారత యువ పేసర్, హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం జింబాబ్వే టూర్‌లో ఉన్నాడు. మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా జింబాబ్వే వెళ్లిన విషయం తెలిసిందే. కాగా.. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఆసియా కప్ ఆడనుంది. ఈ టోర్నీ కోసం మొహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేయలేదు. వన్డే, టెస్టులకు మాత్రమే సిరాజ్‌ను పరిమితం చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సిరాజ్ కూడా రెడ్‌బాల్(టెస్టు)క్రికెట్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అందులో భాగంగానే ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లోకి సిరాజ్ అడుగుపెట్టనున్నాడు.
ఇప్పటికే వార్విక్‌షైర్ టీమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా సెప్టెంబర్‌లో వార్విక్‌షైర్ ఆడనున్న చివరి మూడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో సిరాజ్ బరిలోకి దిగనున్నాడు. ఇక సిరాజ్ తమ జట్టుతో ఒప్పందం చేసుకోవడంపై వార్విక్‌షైర్ క్లబ్ హర్షం వ్యక్తం చేసింది. ‘ఈ సీజన్‌లో ఆడే చివరి మూడు కౌంటీ మ్యాచ్‌ల కోసం భారత పేసర్ సిరాజ్‌తో వార్విక్‌షైర్ ఒప్పందం చేసుకుంది. సెప్టెంబర్ 12న వార్విక్‌షైర్-సోమర్‌సెట్ మ్యాచ్ మొదలవడానికి ముందే సిరాజ్ ఎడ్జ్‌బాస్టన్ చేరుకుంటాడు’అని వార్విక్‌షైర్ క్లబ్ పేర్కొంది.
కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని మొహమ్మద్ సిరాజ్ సైతం వెల్లడించాడు. ఈ సీజన్‌లో వార్విక్‌షైర్‌కు ఆడుతున్న రెండో భారత ఆటగాడిగా సిరాజ్ నిలిచాడు. ఇప్పటికే టీమిండియా క్రికెటర్ కృనాల్ పాండ్యా రాయల్ లండన్ వన్డే కప్‌లో ఈ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: టీమిండియాపై అరుదైన రికార్డు నమోదు చేసిన జింబాబ్వే!
🚨 Warwickshire have signed Mohammed Siraj to play in the #CountyChampionship this year
The bowler will feature in the final three matches of the season pic.twitter.com/4PSDW9e1sv
— ESPNcricinfo (@ESPNcricinfo) August 18, 2022
Warwickshire County Cricket Club Signed Mohammed Siraj For The End Of The County Season pic.twitter.com/6I5RLtcE3O
— CricBails (@cricbailsIN) August 19, 2022