Cheteshwar Pujara: డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ముందు భారత క్రికెట్ అభిమానులకు పుజారా శుభవార్త అందించాడు. కౌంటీ క్రికెట్‌లో సస్సెక్స్ జట్టుకు కెప్టెన్‌గా కావడంతో పాటు తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో సత్తా చాటాడు..
టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్, మిస్టర్ డిఫెండబుల్ చటేశ్వర్ పుజారా రోజుకొక శుభవార్త భారత క్రికెట్ అభిమానులకి చేరవేస్తున్నాడు. ఈ మధ్యనే ఇంగ్లాండ్ కౌంటీ జట్టు సస్సెక్స్ జట్టుకి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న ది నయా వాల్.. తాజాగా సెంచరీ చేసి సత్తా చాటాడు. ఇంకో నెల రోజుల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఉన్న నేపథ్యంలో పుజారా సెంచరీ చేయడం టీమిండియా శిబిరంలో ఉత్సాహాన్ని నింపుతుంది. జూన్ 7 ఆస్ట్రేలియాతో జరగబోయే ఫైనల్ ఇంగ్లాండ్ లోనే జరగనుండడం గమనార్హం. ఒక పక్క ఐపీఎల్ హడావుడిలో ఉన్న ఇండియన్ క్రికెట్ లవర్స్ కి పుజారా సెంచరీ డబుల్ కిక్ ఇచ్చింది.
పుజారా భారత టెస్టు జట్టులో ఎంత కీలక ఆటగాడో మనందరికీ తెలిసిందే. అయితే ఈ నయా వాల్ కి కొన్నేళ్ల క్రితం ఫారెన్ పిచ్ ల మీద విఫలమవుతాడనే విమర్శ ఉంది. ఈ కారణంతోనే జట్టులో స్థానం కోల్పోయాడు. దీంతో ఏ మాత్రం బాధపడకుండా ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ లో చెలరేగి ఆడి.. తిరిగి జట్టులో స్థానం సంపాదించాడు. పుజారా ప్రతిభను మెచ్చి ఇటీవలే సస్సెక్స్ టీమ్.. ఈ నయా వాల్ కి కెప్టెన్సీ ని అప్పగించారు. దానికి తగ్గట్లే పుజారా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ.. తొలి మ్యాచ్ లోనే సెంచరీ బాదేశాడు.
హావ్ వేదికగా డర్హాంతో జరిగిన ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో పుజారా 115 పరుగులు చేసాడు. 55 ఓవర్లో కార్స్ బౌలింగ్ లో వరుసగా రెండు బౌండరీలు బాది 134 బంతుల్లో తన సెంచరీ మార్క్ ని అందుకున్నాడు. దీంతో సస్సెక్స్ జట్టు తొలి రోజు ఆట ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. తనదైన బ్యాటింగ్ తో టీమిండియాకే కాదు సస్సెక్స్ జట్టుకి కూడా మిస్టర్ డిపెండబుల్ గా మారాడు. మరి WTC ఫైనల్ కి ముందు పుజారా సెంచరీ చేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
First century of the season for Cheteshwar Pujara 👏 pic.twitter.com/XSRF2YQxEw
— The Cricketer (@TheCricketerMag) April 7, 2023