ఆటకు సంబంధించి ఒక జట్టు ఎలా ఉండాలో.. మైదానంలో ఎలా ఆడాలో.. చర్చించుకునే వేదికే డ్రెస్సింగ్ రూమ్. అక్కడే ఆటగాళ్లు తమ అనుభవాలను ఇతర ప్లేయర్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా విండిస్ టూర్ లో ఉన్న భారత జట్టు సిరీస్ ను 3-0తో గెలిచిన సంగతి విదితమే. అయితే మూడో వన్డే గెలిచిన తర్వాత ఇండియా డ్రెస్సింగ్ రూంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. దానికి సంబంధించి ట్విట్టర్ లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. వాటి గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
రాహుల్ ద్రవిడ్.. కుర్రాళ్లను సాన పట్టడంలో తనకు తానే సాటి. యువ ఆటగాళ్లను ఎలా గాడిలో పెట్టాలో అతనికి తెలిసినంతగా ఎవరికీ తెలిదంటే అతిశయోక్తి కాదు. అందుకు తగ్గట్టుగానే కుర్రాళ్లను డ్రెస్సింగ్ రూంలో ట్రైన్ చేస్తూ ఉంటాడు. ఆటగాళ్లు కూడా అలానే ద్రవిడ్ ను గౌరవిస్తు ఉంటారు. తాజాగా విండిస్ తో జరిగిన చివరి వన్డేలో గెలిచాక డ్రెస్సింగ్ రూంలో కోచ్ ద్రవిడ్ స్పందిస్తూ..
”ముందుగా మ్యాచ్ గెలిచినందుకు అందరికి కంగ్రాట్స్. మనదంతా యువ జట్టు దానికి తగ్గట్టుగానే మీరంతా చాలా బాగా ఆడారు. ఈ విజయం మీ అందరిది. ధావన్ నువ్వు చాలా బాగా ఆడావ్’. అని అన్నాడు. అలా అనగానే ధావన్ నవ్వుతూ.. ద్రవిడ్ ను చూస్తూ రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాడు. దీంతో అక్కడ ఓ ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. కుర్రాళ్లంతా బాగా ఆడారు. ఇది సమష్టి విజయం. దీన్ని మనం సెటబ్రేట్ చేసుకోవాలి’. అంటూ.. అందరూ కలిసి ఫొటోకి ఫోజిచ్చారు. అలానే మేం గెలుపు గుర్రాలం అంటూ స్లోగన్స్ ఇచ్చారు. డ్రెస్సింగ్ రూంలో భారత ఆటగాళ్లు ఇలా సరదాగా ఉండటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
From The #TeamIndia Dressing Room!
Head Coach Rahul Dravid & Captain @SDhawan25 applaud 👏 👏 the team post the 3-0 win in the #WIvIND ODI series. 🗣 🗣
Here’s a Dressing Room POV 📽 – By @28anand
P.S. Watch out for the end – expect something fun when Shikhar D is around 😉😁 pic.twitter.com/x2j2Qm4XxZ
— BCCI (@BCCI) July 28, 2022