ప్రస్తుతం భారత జట్టు విండీస్ టూర్ లో అదరగొడుతోంది. మూడు వన్డేల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా జరిగిన మూడో వన్డేలో డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఇండియా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో విండిస్ కెప్టెన్ నికోలస్ పూరన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు. మరి ఆ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. నికొలస్ పూరన్.. గత ఐపీఎల్ లో అతని మెరుపుల గురించి ప్రత్యేకంగా చెప్పుకొనవసరం లేదు. దాంతో క్రీడా ప్రపంచంలో అతని పేరు మారు మ్రోగింది. ఈక్రమంలో ప్రస్తుతం ఇండియాతో జరుగుతున్న సిరీస్ కు కెప్టెన్ వ్యవహరిస్తున్న పూరన్ వన్డే సిరీస్ ఓటమిపై స్పందించాడు. అతడు మీడియాతో మాట్లాడుతూ.. ''వన్డే సిరీస్ ఓడిపోవడం చాలా బాధాకరం. ఇది మాకు కష్టకాలం. అయినా గాని మా ఆటగాళ్లు తొలి రెండు వన్డేల్లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించారు. అది మాకు సంతృప్తికరం. ఈ మ్యాచ్ డక్ వర్త్ లూయిస్ కావడంతో మాపై ఒత్తిడి పెరిగింది. దీంతో మేం విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయాం. అలా మేం ఓడిపోయాం. మరీ ముఖ్యంగా మా జట్టులో అనుభవం గల ఆటగాళ్లు లేరు. అందులోను వారు ఇప్పుడే వన్డేలు ఎలా ఆడాలో తెలుసుకుంటున్నారు''. అంటూనే.. 'మా బౌలర్లు పవర్ ప్లేలో వికెట్లు తీయకున్నా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారని ప్రశంసించాడు. అలాగే న్యూజిలాండ్ తో జరగబోయే సిరీస్ లో మేం అత్యధ్భుతమైన ప్రదర్శన కనబరుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక భారత్ తో జరగబోయే 5 టీ20లకు సిద్ధంగా ఉన్నామని, వన్డేలు పోయాయి.. కానీ టీ20ల్లో చూసుకుంటామని నికోలస్ పూరన్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా తొలి టీ20 శుక్రవారం జరగనుంది. మరి విండిస్ కెప్టెన్ పూరన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Shikhar Dhawan: మ్యాచ్ తర్వాత ధావన్ చేసిన పనికి ధోని ఫ్యాన్స్ ఫిదా! ఇదీ చదవండి: Moeen Ali: విధ్వంసం సృష్టించిన బెయిర్‌స్టో! ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో మొయిన్‌అలీ రికార్డు