వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ధావన్ సేన క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. బుధవారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 119 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో టీమిండియా ఒక కొత్త చరిత్రను లిఖించింది. ప్రపంచ క్రికెట్లో వన్డే ఫార్మాట్ మొదలైనప్పటి నుంచి వెస్టిండీస్‌ను వెస్టిండీస్‌లో భారత్ వైట్‌వాష్ ఇంతవరకు చేయలేదు. ఈ విజయంతో వెస్టిండీస్‌ను వెస్టిండీస్‌లో వన్డేల్లో వైట్‌వాష్ చేసి చరిత్రను తిరగరాసింది. ఇలాంటి ఘనమైన రికార్డు తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ కెప్టెన్సీలో రావాడం విశేషం. ఇండియన్ క్రికెట్లోనే అత్యుత్తమ కెప్టెన్లుగా ఉన్న సౌరవ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీ హయాంలో కూడా ఈ ఘనత సాధించలేకపోయారు. వారివారి పిరియడ్‌లో అనేక గొప్ప గొప్ప విజయాలు, వెస్టిండీస్‌లో సిరీస్ విజయాలు ఉన్నప్పటికీ.. వెస్టిండీస్‌ను వెస్టిండీస్‌లో వన్డేల్లో వైట్‌వాష్ చేయలేకపోయారు. ఇలాంటి గొప్ప కెప్టెన్ల హయాంలో సాధించేలేకపోయిన రికార్డును ఇప్పుడు తాత్కాలిక కెప్టెన్, యువ క్రికెటర్లతో కూడిన యంగ్ ఇండియన్ టీమ్ సాధించడం విశేషం. అలాగే ఒక జట్టును ఒక క్యాలెండర్ ఇయర్లో రెండు సార్లు వైట్‌వాష్ చేసిన ఘనత కూడా టీమిండియాకే దక్కింది. ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో టీమిండియా విండీస్ వైట్‌వాష్ చేసింది. ఇప్పుడు వెస్టిండీస్ టూర్లో మూడు వన్డేల సిరీస్‌ను వైట్‌వాష్ చేసి ఈ రికార్డును అందుకుంది. మరి ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ! Congratulations #TeamIndia on winning the #WIvIND ODI series! Over to T20Is now! pic.twitter.com/kpMx015pG1 — BCCI (@BCCI) July 27, 2022