త్వరలోనే యూఏఈ వేదికగా ఆసియా కప్ 2022 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు తమ తమ బలా బలాలను అంచనా వేసుకునే పనిలో నిమగ్నం అయ్యాయి. అయితే కొన్ని జట్లకు గాయాల రూపంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాలతో స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్ కే దూరం అయ్యారు. దీంతో అభిమానులు ఒక్కింత నిరాశకు గురైయ్యారు అనే చెప్పాలి. ఇక గాయాల వార్తలకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
జస్ప్రీత్ బుమ్రా.. షాహీన్ అఫ్రీదీ.. దుష్మంత చమీరా.. గాయాల కారణంగా వీరు త్వరలో ప్రారంభం అయ్యే ఆసియా కప్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆయా జట్లు తమ తమ స్టార్ ఆటగాళ్ల ను కోల్పోవడంతో కొంత నిరాశ చెందాయి. అయినప్పటికీ ఇది ముందుకు పోవాల్సిన సమయం. ఆటగాళ్లు అన్నాక గాయాలు అవ్వడం సహజం. అయితే ఇలాంటి కీలక టోర్నమెంట్ సమయాలలో గాయాల బెడద టీంను మానసికంగా దెబ్బతీస్తుంది. దీంతో ఆ ప్రభావం మ్యాచ్ లపై కూడా పడే పరిస్థితులూ లేకపోలేదు. ఇప్పటికే ఈ స్టార్ ఆటగాళ్లు లేక పోవడంపై మాజీ క్రికెటర్స్ పలు విధాలుగా స్పందించిన విషయం తెలిసిందే. అయితే ఈ ముగ్గురు మేటి బౌలర్స్ ఆడక పోవడంతో ప్రత్యర్థి జట్లకు కొన్ని లాభాలూ లేకపోలేదు.
క్రీడా లోకంలో జట్టుకు జట్టుకు మధ్య పోటీ ఉన్నట్లు ఆటగాడికి ఆటగాడికీ మధ్య కూడా పోటీ ఉంటుంది. ఉదాహరణకు సచిన్-అక్తర్, సునీల్ గవాస్కర్-ఇమ్రాన్ ఖాన్, అండర్సన్-డేవిడ్ వార్నర్, దుష్మంత చమీరా- రోహిత్ శర్మ ఇలా మరికొన్ని జోడిలు ఉన్నాయి. తాజాగా శ్రీలంక పేస్ దళాన్ని ముందుండి నడిపడంలో దుష్మంత చమీరా కీలక పాత్ర వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే భారత్ పై మంచి రికార్డును కలిగి ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మను ఇంటర్నేషనల్ టీ 20లో 6 సార్లు అవుట్ చేసి రోహిత్ పై ఆధిపత్యాన్ని చెలాయించాడు. ఆసియా కప్ లో వీరి మధ్య జరగబోయే టగ్ ఆఫ్ వార్ ను చూద్దాం అనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.
షాహీన్ అఫ్రిదీ కూడా టీంఇండియాపై మంచి రికార్డును కలిగి ఉన్నాడు. భారత్ టీ20 ప్రపంచ కప్ ఓడిపోవడంలో అతడిదే కీలక పాత్ర. ఇతడు భారత డాషింగ్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ ను కొన్ని సార్లు అవుట్ చేశాడు. దీంతో ఇతడు గాయపడటం ఒక విధంగా భారత్ కే కాక మిగతా టీంలకు కూడా మంచి విషయమే. అయితే బుమ్రా గాయ పడటం భారత్ కు పెద్ద ఎదురుదెబ్బగా మాజీలు అభివర్ణిస్తున్నారు.
ఇలా స్టార్ పేసర్లు గాయాల కారణంగా వైదొలగడంపై క్రీడా అభిమానులు స్పందిస్తూ..” ఈ సారి మ్యాచ్ లు చప్పగా సాగాడం ఖాయం అని ఒకరు అంటే.. ఈ సారి ఆసియా కప్ లో మజా లేదా? అని మరోకరు కామెంట్ చేశారు. ఇక స్టార్ బౌలర్లు లేకపోవడంతో ఈ సారి కప్ గెలిచేది బంగ్లాదేశ్ లేదా ఆఫ్గనిస్తాన్ అని” మరో నెటిజన్ జోస్యం చెప్పాడు. స్టార్ ఆటగాళ్లు లేకుండా ఆసియా కప్ జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Jasprit Bumrah❌
Shaheen Afridi❌
Dushmantha Chameera❌India, Pakistan and Sri Lanka will miss the services of their key pacers in Asia Cup 2022. pic.twitter.com/WBhUsXZk94
— CricTracker (@Cricketracker) August 22, 2022