క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ చిరకాల స్నేహితుడు వినోద్ కాంబ్లి తనకు ఒక ఉద్యోగం కావాలని అభ్యర్థించిన విషయం మనకు తెలిసిందే. బీసీసీఐ నుంచి వచ్చే పెన్షన్ ఏ మాత్రం తన కుటుంబ అవసరాలకు సరిపోవడం లేదని అతడు వాపోయాడు. దీంతో అతడి అభ్యర్థనను విన్న ఓ వ్యాపారవేత్త కాంబ్లికి ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. సచిన్-కాంబ్లి ఈ క్రికెట్ ద్వయం బడికెళ్లే వయసులోనే క్రికెట్ లో ఎన్నో రికార్డులను తిరగరాశారు. దాంతో ఈ కుర్ర జంటపైనే అందరి కళ్లు పడ్డాయి. ఈ పదునైన ఆటతో అనతికాలంలోనే భారత జట్టుకు వీరు ఎంపికైయ్యారు. ఇక కాంబ్లి ప్రారంభంలోనే డబుల్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఇదే ఫామ్ ను కొనసాగించలేక పోయాడు. అదీ కాక తాగుడుకు బానిసై తన కెరీర్ ను తానే నాశనం చేసుకున్నాడు. దీంతో ఎక్కువ కాలం పాటు ఇండియాకు ఆడలేక పోయాడు. ఆటకు వీడ్కోలు పలికాక వినోద్ ఏ రంగంలో పని చేయలేదు. కేవలం బీసీసీఐ నుంచి రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ రూ. 30 వేలే అతనికి ఆదాయంగా వచ్చేది. అదీ కాక అతడి తాగుడు చూసి ఏ క్రికెట్ అసోషియేషన్ కోచ్ పదవి ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలోనే తనకు ఓ ఉద్యోగం కావాలని అభ్యర్థించాడు. ఆ వీడియో చూసిన మహారాష్ట్ర కు చెందిన వ్యాపార వేత్త సందీప్ తోరట్ వినోద్ కాంబ్లికి ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. అయితే ఆ ఉద్యోగం క్రికెట్ కు సంబంధించినది కాదు. ఆ జాబ్ ఆర్థిక విభాగానికి సంబంధించినది, ఇక జీతం వచ్చి నెలకు రూ. లక్ష ఇస్తానని తోరట్ తెలిపాడు. ప్రస్తుతానికి అయితే ఈ విషయంపై వినోద్ కాంబ్లి స్పందించలేదు. ఉదార స్వభావంతో ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు వచ్చిన తోరట్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కాంబ్లి ఈ ఉద్యోగాన్ని చేస్తాడో లేదో వేచిచూడాల్సిందే. మరి విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. A story on Vinod Kambli in today’s @mid_day by @Haritjoshi and myself…https://t.co/fnJlIzne27 — Clayton J Murzello (@ClaytonMurzello) August 17, 2022 ఇదీ చదవండి: Sikandar Raza: జింబాబ్వే బ్యాటర్ సికందర్ రజాను రౌండప్ చేసిన భారత ఆటగాళ్లు! ఇదీ చదవండి: ఆసియా కప్‌కు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ దూరం.. కోచ్‌గా టీమిండియా లెజెండ్..!