''మోసే వాడికి తెలుస్తుంది కావడి బరువు'' అన్నట్లు గా ఆట ఆడే వాడికి తెలుస్తుంది అది ఎంత కష్టమో. ఏ ఆటైనా సరే ఒక ఆటగాడికి ప్రాక్టీస్ కావాలి. ఒక ఆటగాడు జట్టులోకి రావాలి అంటే ఎంత కష్ట పడాలో బుమ్రాని చూస్తే అర్థం అవుతుంది. గాయం కారణంగా బుమ్రా ఆసియా కప్-2022 కు దూరం అయిన సంగతి తెలిసిందే. అయితే అతడు ఫిట్ నెస్ కోసం కష్ట పడే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. జస్ప్రీత్ బుమ్రా.. ప్రపంచ మేలిమి బౌలర్లలో ఒకడు. తన వైవిద్యమైన బౌలింగ్ తో ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టగల నాణ్యమైన బౌలర్ గా అతడు గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక డెత్ ఓవర్లలో అయితే అతని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే అతడ్ని డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అంటారు. ప్రస్తుతం వెన్ను నొప్పి కారణంగా ఆసియా కప్-2022కు దూరం అయ్యాడు. కానీ ఆటపై తనకున్న శ్రద్దను అలాగే ప్రేమను, త్వరలోనే జట్టులోకి రావాలన్న కసిని తన ప్రాక్టీస్ ద్వారా తెలిపాడు. కఠినమైన శిక్షణ తీసుకుంటూ క్రికెట్ అభిమానులను పలకరించాడు. గడ్డు పరిస్థితులను ఎదుర్కొవడం పెద్ద కష్టమేమీ కాదు అంటూ తన బ్లాగ్ లో రాసుకొచ్చాడు. మైదానంలో హైజంప్, రన్నింగ్ లాంటి ప్రాక్టీస్ లను కఠోరంగా సాధన చేస్తున్నాడు. ఈ దృశ్యాలలో అతడు ఎప్పుడు జట్టులోకి రావాలి అన్న కసి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బుమ్రా ఆసియా కప్ ఆడక పోవడం భారత్ కు పెద్ద దెబ్బే. అయినప్పటికీ ఇండియా పటిష్ట లైనప్ తో ఉంది. తాజాగా వరుస సిరీస్ లు గెలుస్తూ మంచి జోరుమీద ఉంది. ఇదే జోరును రాబోయే ఆసియా కప్ లోనూ చూపించాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలో ఆటగాళ్లు అంటే కేవలం డబ్బులు, విమానాలు, స్టార్ హోటల్లే కాదు మైదానంలో చిరుతల్లా పరిగెత్తాలి.. ఒత్తిడులను ఎదుర్కొవాలి.. గాయాలను అధిగమించాలి ఇలా చాలా వాటిని ఎదుర్కొని నిలిచి తన ఫామ్ ను కొనసాగించాలి అప్పుడే అతడికి స్టార్ హోదా లభిస్తుంది. డబ్బులు ఉరికే రావు అన్నట్లు.. పేరు కూడా ఉరికే రాదు. మరి ఫిట్ నెస్ కోసం కఠోర సాధన చేస్తున్న బుమ్రాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. WATCH: India fast bowler Jasprit Bumrah training to get back into fitness. He was ruled out of the Asia Cup with a back injury.#JaspritBumrah #AsiaCup pic.twitter.com/uhiEcG6ZgA — News18 CricketNext (@cricketnext) August 23, 2022 ఇదీ చదవండి: వీడియో: సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్‌లో కోహ్లీ ప్రాక్టీస్! బద్ధశత్రువులు ఇలా కలిసిపోయారా..! ఇదీ చదవండి: ఎట్టకేలకు వినోద్ కాంబ్లికి జాబ్ ఆఫర్! భారీ జీతం..