భారత్-సౌతాఫ్రికా మధ్య జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా మారింది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. అలాగే రెండో రోజు దక్షిణాఫ్రికాను 229 పరుగులకు ఆలౌట్ చేశారు టీమిండియా బౌలర్లు. శార్దూల్ ఠాకూర్ ఖాతాలో 7 వికెట్లు రాగా, మహ్మద్ షమీ 2, జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు. ముఖ్యంగా శార్దుల్ ఠాకుర్ కెరీర్‌లోనే ఉత్తమ ప్రదర్శన కనబర్చాడు.
Ind vs SA: Jasprit Bumrah does perfect impression of R Ashwin’s bowling action, off-spinner reacts – Watch https://t.co/1NiXtcmwim
— Md Nazmul Hossain (@nazmulmarketer1) January 4, 2022
ఇక శార్దుల్‌కు తోడుగా బుమ్రా డేంజర్ బౌలింగ్‌తో సౌతాఫ్రికా బ్యాటర్లను భయపెట్టారు. బౌన్సర్లతో ఇబ్బంది పెట్టారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 71వ ఓవర్లో శార్దూల్ వేసిన ఓ బంతికి మార్కో జెన్సన్ గాయపడ్డాడు. అదనపు బౌన్స్‌తో జెన్సన్ ఛాతీకి తగిలింది. ఫిజియోను పిలవాల్సినంత వేగంగా బంతి తగిలింది. శార్దూల్ బంతికి తగిలిన తర్వాత మార్కో ఛాతీ ఎర్రగా మారింది. ఫిజియో మైదానంలోకి రావడంతో కొంతసేపు ఆట నిలిచిపోయింది. 76వ ఓవర్ నాలుగో బంతి ఆలివర్ ఎడమ మోచేతికి తాకింది. బంతి తగిలిన తర్వాత, ఒలివియర్ చాలా నొప్పిగా కనిపించాడు. వెంటనే ఫిజియో మైదానానికి రావాల్సి వచ్చింది.
What is bumrah and siraj doing on ground if they are not bowling? @imVkohli ,@klrahul11 ,@MdShami11 ,@vikrantgupta73 ,@BCCI https://t.co/3Fy8YMVJk6
— Krish (@Krish302879751) January 4, 2022
అంతకుముందు, బుమ్రా తన ప్రమాదకరమైన బీమర్‌తో మార్కో జెన్సన్‌ను భయపెట్టాడు. బుమ్రా స్లో ఆఫ్ కట్టర్‌కు ప్రయత్నిస్తే.. బంతి చేజారి నేరుగా జెన్సన్ శరీరం వైపునకు వెళ్లింది. జెన్సన్ సమయానికి స్పందించి తనను తాను రక్షించుకున్నాడు. బుమ్రా వేసిన బీమర్‌ను అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. అలాగే బుమ్రాను హెచ్చరించాడు. ఇలా డేంజర్ బౌలింగ్‌తో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తించారు భారత బౌలర్లు. మరి బుమ్రా, శార్దుల్ బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లీ, ద్రావిడ్, గంభీర్, పుజారా చేయలేనిది.. బుమ్రా చేశాడు! వీడియో వైరల్