ఇండియన్ క్రికెట్‌లో టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్‌కు ఆ పదవి కట్టబెట్టాలని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నారు. మరి సెహ్వాగ్‌ను సూచించడానికి కారణం చెబుతూ..
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజకీయాలతో పాటు.. క్రికెట్ గురించి పలు విషయాల్లో స్పందిస్తుంటాడు. ఇటివల కేఎల్ రాహుల్ ఫామ్‌పై వెంకటేష్ ప్రసాద్, ఆకాశ్ చోప్రా మధ్య జరిగిన వివాదంలో పెద్ద మనిషిగా మారిన భజ్జీ.. ట్విట్‌వార్‌కు ముగింపు పలకాలని సూచించాడు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు కీలక పదవి కట్టబెట్టాలని బీసీసీఐని కోరాడు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవిని స్వీకరించాలని సెహ్వాగ్‌ను బీసీసీఐ కోరాల్సిందిగా సూచించాడు. చీఫ్ సెలెక్టర్ పదవి ఏం చిన్న విషయం కాదని, ఆ పదవిలో సెహ్వాగ్‌లా గట్టిగా మాట్లాడే వ్యక్తి, దమ్మున్న వ్యక్తి ఉండాలని అన్నాడు.
తాజాగా జాతీయ చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న చేతన్ శర్మపై ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ కొన్ని సంచలన విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. టీమిండియా అంతర్గత విషయాలు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ-మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మధ్య విభేదాలు, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలపై చేతన్ శర్మ పలు వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఆటగాళ్లు ఫిట్‌నెస్ కోసం ఇంజెక్షన్లు తీసుకుంటారని కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ స్టింగ్ ఆపరేషన్ వీడియో వైరల్ కావడంతో అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో అతను తన చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే అతని రాజీనామాపై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, అతని స్థానంలో శివ సుందర్ దాస్ కమిటీ ఆసీస్‌తో రెండు టెస్టులు, వన్డేలకు జట్టును ఎంపిక చేసింది.
అయితే.. ప్రస్తుతం చీఫ్ సెలెక్టర్ పదవీ ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఈ పదవిని వీరేంద్ర సెహ్వాగ్‌తో భర్తీ చేయాలని భజ్జీ సూచించాడు. అయితే.. చీఫ్ సెలెక్టర్‌కు ఇచ్చే జీతం కంటే సెహ్వాగ్ కామెంటేటర్‌గానే ఎక్కువ సంపాదిస్తున్నాడని, అలాంటి వ్యక్తిని చీఫ్ సెలెక్టర్‌గా నియమించాలంటే బీసీసీఐ కూడా అతనికి భారీగానే చెల్లించాల్సి ఉంటుందని అన్నాడు. ఎందుకంటే.. గట్టిగా మాట్లాడే వ్యక్తులు, పెద్ద పేరున్న వ్యక్తులు ఉంటే సెలెక్షన్ కూడా బాగుంటుందని, రాహుల్ ద్రవిడ్ లాంటి గొప్ప వ్యక్తిని కోచ్‌గా పెట్టుకుని, చీఫ్ సెలెక్టర్‌గా ఒక ఏడాది, రెండేళ్లు క్రికెట్ ఆడిన వారిని నియమిస్తే.. ఫలితాలు సరిగా రావాని, సెహ్వాగ్ లాంటి వ్యక్తి చీఫ్ సెలెక్టర్‌గా ఉంటే ఆణిముత్యాలంటి ఆటగాళ్లను వెతికిపట్టుకుని, జాతీయ జట్టుకు అందిస్తే.. కోచ్‌గా ద్రవిడ్ పని కూడా సులువు అవుతుందని భజ్జీ పేర్కొన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Harbhajan Singh reacts on the salary of chief selectors in India.#HarbhajanSingh | #VirenderSehwag | #BCCI pic.twitter.com/qWxYtFtCL9
— CricTracker (@Cricketracker) February 28, 2023