Impact Player In IPL 2023: ఈ ఐపీఎల్ సీజన్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అనే కొత్త రూల్‌ను బీసీసీఐ తీసుకొచ్చింది. మరి ఈ రూల్‌ను జట్లు ఎలా ఫాలో అవుతాయి. అసలు ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఎవరూ.. వారు జట్టులో భాగంగా ఉంటారా? లేదా అనేది తెలుసుకుందాం..
ఐపీఎల్ 2023 సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌తో ఈ రిచ్ లీగ్ 16వ సీజన్‌కు టాస్ పడనుంది. అయితే ఈ సీజన్ నుంచి ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అనే కొత్త కాన్సెప్ట్‌ను బీసీసీఐ ఐపీఎల్‌లో ప్రవేశపడుతుంది. అయితే.. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ఇంకా క్రికెట్ అభిమానుల్లో సరైన క్లారిటీ లేదు. ఈ రూల్ దేనికి? మ్యాచ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అసలు దీన్ని ఎప్పుడు ఎలా ఉపయోగిస్తారే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Impact Player Rule pic.twitter.com/nb9Cf7zofF
— RVCJ Media (@RVCJ_FB) September 17, 2022
ఆస్ట్రేలియా వేదికగా జరిగే.. బిగ్ బాష్ టోర్నీలోనూ ఇలాంటి తరహా నిబంధన అమలులో ఉంది. బీబీఎల్ లో ‘X ఫ్యాక్టర్’ పేరుతో అమలు పరుస్తున్నారు. ఇందులో, ప్రతి జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 10వ ఓవర్‌కు ముందు ప్లేయింగ్-11లో 12వ లేదా 13వ ఆటగాడిని చేర్చుకోవచ్చు. ఈ సమయంలో అతని స్థానంలో బ్యాటింగ్ చేయని లేదా ఒకటి కంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయని ఆటగాళ్లను భర్తీ చేసుకుంటుంది. ఈ నిర్ణయం.. ఒక్కోసారి మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తోంది.
Remember the Super Sub?
Do you think the idea of an ‘Impact Player’ will make T20 games more interesting?
— Cricbuzz (@cricbuzz) September 17, 2022
టాస్ సమయంలో, 11 మంది ఆటగాళ్లతో పాటు నలుగురు ఇంపాక్ట్ ప్లేయర్‌లను జట్టులో పేర్కొనాలి. ఆ ఆటగాళ్లు ఎవరూ అన్న విషయాన్ని ముందుగా ఫీల్డ్ అంపైర్, ఫోర్త్ అంపైర్‌కు తెలియజేయాలి. ఇందులో పేర్కొన్న ఒక ఆటగాడిని మాత్రమే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించవచ్చు. రెండు ఇన్నింగ్స్‌లలో 14వ ఓవర్‌కు ముందు ఇంపాక్ట్ ప్లేయర్‌ని ఉపయోగించవచ్చు. ఇక.. రెండు జట్లకు.. ఒక్కో మ్యాచ్‌కి.. ఒక ఇంపాక్ట్ ప్లేయర్‌ని మాత్రమే ఉపయోగించుకోవడానికి అనుమతి ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌తో భర్తీ చేయబడిన ఆటగాడు ఇకపై మిగిలిన మ్యాచ్‌లో పాల్గొనలేడు. అలాగే.. ప్రత్యామ్నాయ ఫీల్డర్‌గా తిరిగి రావడానికి కూడా అనుమతించబడడు.
ఇక్కడ మ్యాచ్ సమయంలో గాయపడిన ప్లేయర్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ ఉపయోగించే వీలు ఉండదు. ప్రస్తుతమున్న రూలే వర్తిస్తుంది(సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్స్). ఒకవేళ.. అతని స్థానంలో జట్టు ఇంపాక్ట్ ప్లేయర్‌ను ప్రవేశపెడితే గాయపడిన ఆటగాడు ఇకపై మ్యాచ్‌లో పాల్గొనలేడు. ఒకసారి.. ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా ఎవరు పేరు ఇస్తారో వారే మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. మినహాయించిన ఆటగాడు ఆడలేరు. బ్యాటింగ్ చేస్తున్న జట్టు వికెట్ పతనం సమయంలో లేదా ఇన్నింగ్స్ విరామ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్‌ని పరిచయం చేయవచ్చు. అయితే, జట్టు కెప్టెన్ లేదా మేనేజ్‌మెంట్.. ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నియమాన్ని ఉపయోగించే ముందు ఫీల్డ్ అంపైర్ లేదా ఫోర్త్ అంపైర్‌కు తెలియజేయాలి. అంతే కాకుండా.. ఒక బౌలర్‌ను ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా చేర్చినట్లయితే, అతను తన పూర్తి 4 ఓవర్లు బౌల్ చేస్తాడు. మరియు బ్యాటింగ్ చేయొచ్చు. అయితే.. ఈ నిబంధనలు తప్పనిసరి కాదు. ఉపయోగించాలా వద్దా అనేది జట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ రూల్స్ పై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
People had laughed at me when I did the story in 2019 that BCCI is contemplating bringing in the concept of super sub for the IPL..so here we go..sometimes we need to wait to be vindicated 🤣 #BCCI #ImpactPlayer #T20 #CricketTwitter pic.twitter.com/1bY6qHmbsZ
— Baidurjo Bhose (@bbhose) September 17, 2022