ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మైదానంలో అగ్రెసివ్‌గా ఆడతాడో రియల్‌లైఫ్‌లో అంత ఫన్నీగా ఉంటాడు. సోషల్ మీడియాలో అయితే ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ.. సందు దొరికితే ఏదో ఒక వీడియోను అభిమానులతో పంచుకుంటాడు. తన ఫ్యామిలీతో సరదగా గడిపిన ఫొటోలతో పాటు వారితో కలిసి చేసిన రీల్స్ పోస్టు చేస్తుంటాడు. అలాగే మన తెలుగు పాటలకు డాన్స్ చేస్తూ రచ్చరచ్చ చేస్తాడు. అల్లు అర్జున్, మహేష్ బాబు పాటలకు స్టెప్పులు వేసిన అదరగొట్టిన వీడియోలు కూడా ఉన్నాయి. సాధారణ ఫ్యాన్స్ చేసినట్లు హీరోల బాడీకి తన ఫేస్ పెట్టి రీల్స్ కూడా చేశాడు. అవిన్నీ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యాయి. తాజాగా వార్నర్ మరో వీడియోను రిలీజ్ చేశాడు. ఈ సారి సూపర్‌స్టార్ మహేష్‌బాబు వీడియోను ఎడిట్ చేసి వదిలాడు.
మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఖలేజా మూవీలోని ఒక సీన్‌లో మహేష్ బాబు రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్న వీడియోను ఎడిట్ చేసి మహేష్ పేస్‌పై తన పేస్‌ను పెట్టాడు. ఆ వీడియోకు గుర్తుపట్టారా? అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎక్కువ సీజన్లు ఆడటంతో వార్నర్ తెలుగువారికి బాగా దగ్గరయ్యాడు. సన్‌రైజర్స్ టీమ్‌లో నుంచి వార్నర్‌ను తీసేసినప్పుడు సోషల్ మీడియాలో ఆ టీమ్ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వార్నర్‌కు చాలా మంది తెలుగు అభిమానులు ఉన్నారు. అందుకే వార్నర్ కూడా తెలుగు హీరోల వీడియోలు చేస్తుంటాడు. ఇప్పుడు మహేష్ బాబు వీడియో చేయడంతో మహేష్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
కాగా.. వార్నర్ ప్రస్తుతం ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. ఇటివల ఆరోన్ ఫించ్ ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసీస్ తర్వాతి కెప్టెన్‌గా వార్నర్‌ను ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా వార్నర్‌పై కెప్టెన్సీ విషయంలో నిషేధం ఉన్నప్పటికీ అతనికే కెప్టెన్సీ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోన్ ఫించ్, ప్యాట్ కమిన్స్ మద్దతు కూడా వార్నర్‌కే ఉన్నట్లు సమాచారం. మరి వార్నర్ ఆస్ట్రేలియా కెప్టెన్ అయితే ఎలా ఉంటుంది అనే విషయంతో పాటు అతను పోస్టు చేసిన మహేష్ బాబు వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: వెంకటేశ్ అయ్యర్‌ను బౌలర్ ఎందుకు కొట్టాడు? ఇప్పుడు అయ్యర్ పరిస్థితి ఎలా ఉందంటే?