బంగ్లాదేశ్ టూర్ ఆఫ్ జింబాంబ్వే-2022లో బంగ్లా ఆటగాళ్లకు ఎదురుదెబ్బ తగిలింది. టీ20 సిరీస్ ను జింబాంబ్వే సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్ లో గెలిచిన జింబాంబ్వే రెండో టీ20లో ఓటమి పాలైంది. నిర్ణయాత్మక మ్యాచ్ లో జింబాంబ్వే 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓటమి సంగతి పక్కన పెడితే జింబాంబ్వే ఆటగాడు ర్యాన్ బర్ల్ కొట్టిన సిక్సర్లకు బంగ్లా ఆటగాళ్ల ముఖాలన్నీ తెల్లబోయాయి.
6 వికెట్లు కోల్పోయి.. అప్పటి వరకు తక్కువ స్కోర్ తో సతమతమవుతున్న జింబాంబ్వే జట్టు ఒకే ఓవర్లో 34 పరుగులు స్కోర్ చేసింది. 15వ ఓవర్ వేసేందుకు వచ్చిన నసుమ్ అహ్మద్ కు బర్ల్ చుక్కలు చూపించాడు. 6 బంతుల్లో ఒక ఫోర్ 5 సిక్సర్ల సాయంతో ఏకంగా 34 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ర్యాన్ బర్ల్ కొట్టిన ఆరు సిక్సర్లలో 5 సిక్సర్లు ఈ ఓవర్‌లోనివే కావడం విశేషం. అలా ఒక ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన యువరాజ్(3), పొలార్డ్(36), రోస్ టేలర్(34) తర్వాత స్థానంలో ర్యాన్ బర్ల్ నిలిచాడు.
Most runs smashed in a T20I over 👇
36 ➜ Yuvraj Singh vs Stuart Broad
36 ➜ Kieron Pollard vs Akila Dananjaya
34 ➜ Tim Seifert, Ross Taylor vs Shivam Dube
34 ➜ RYAN BURL VS NASUM AHMED 🔥🔥🔥#ZIMvBAN— ESPNcricinfo (@ESPNcricinfo) August 2, 2022
మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాంబ్వే 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ర్యాన్ బర్ల్ 28 బంతుల్లో 54 పరుగులు చేశాడు. తర్వాత జోంగ్వే(35) ఆకట్టుకున్నాడు. స్వల్ప లక్ష్యంతోనే బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఛేదనలో మాత్రం చతికిల పడ్డారు. అఫీఫ్ హుస్సేన్(39*) తప్ప ఎవరూ పెద్దగా రాణించలేదు. 10 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడటమే కాకుండా.. సిరీస్ ని కూడా కోల్పోయారు. ర్యాన్ బ్లర్ విధ్వంసకర బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
34 runs in a single over by Ryan Burl in a T20I match pic.twitter.com/b2wu8qDJdz
— Johns. (@CricCrazyJohns) August 2, 2022