టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావాలంటే ఒకటే మార్గం ఉందని ఆయన వెల్లడించారు. ఇటీవల పార్థివ్ పటేల్ టీమిండియా జట్టులో టాప్ ఆర్డర్లో యువ ఆటగాళ్ళకు అవకాశాలు ఇస్తూ ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఓపెనర్లకే ఈ అవకాశాలు ఇస్తోంది. కేఎల్ రాహుల్ గాయపడడం, విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో టాప్ ఆర్డర్లో యువ బ్యాట్స్మెన్లు తమ సత్తా నిరూపించుకునేందుకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో సూర్యకుమార్.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా అవతారమెత్తారు. అంతకు ముందు రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్‌లు కూడా టీ20 ఫార్మాట్లో ఓపెనర్లుగా వచ్చారు. ఈ విషయంపై స్పందించిన పార్థివ్ పటేల్.. కోహ్లీని టీమిండియా తుది జట్టులో ఉంచాలని నిర్ణయించినందునే ఇలా యువకులకు ఓపెనర్లుగా అవకాశం ఇస్తుందని చెప్పుకొచ్చారు. కోహ్లీ వన్డే క్రికెట్ ఆడితే చూడాలని ఉందని, అతను ఫామ్‌లోకి రావాలంటే వన్డే ఫార్మాటే తేలికైన మార్గమని అన్నారు. 50 ఓవర్ల ఆటలో చాలా సమయం ఉంటుందని.. ధావన్, శుభ్‌మన్ కూడా ఇలాగే వన్డే క్రికెట్లో ఫామ్‌లోకి వచ్చారని గుర్తుచేశారు. ఈ ఇద్దరూ అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో బంతికో పరుగు చొప్పున రాబట్టారని పటేల్ చెప్పుకొచ్చారు. క్రికెట్లో విరాట్ కోహ్లీ ఒక దిగ్గజమని, మనం ఇప్పుడు చూస్తున్న మార్పులన్నీ ఓపెనింగ్ విభాగంలో చోటు చేసుకుంటున్నాయని పటేల్ అన్నారు. కోహ్లీని తుది జట్టులో ఉంచడానికి టీమిండియా చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే.. సూర్యకుమార్, రిషభ్ పంత్ వంటి ఆటగాళ్లను ఓపెనర్లుగా పంపిస్తున్నారని పటేల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫామ్ కోల్పోవడంపై కొద్ది కాలంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీకి.. టీమిండియా ప్రస్తుత విండీస్ పర్యటనలో విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కోహ్లీకి పలువురు మాజీ క్రికెటర్ల నుంచి మద్ధతు లభించడంతో.. కోహ్లీ మళ్ళీ ఫామ్‌లోకి రావడం ఖాయమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి కోహ్లీ ఫామ్‌లోకి రావాలంటే వన్డే ఒక్కటే మార్గమన్న పార్థివ్ పటేల్ వ్యాఖ్యలపై మీరు ఏకీభవిస్తారా? లేదా? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: సూర్యకుమార్ కెరీర్‌ను నాశనం చెయొద్దు! రోహిత్‌కు భారత మాజీ క్రికెటర్ రిక్వెస్ట్ ఇది కూడా చదవండి: కుంబ్లేని సెలక్ట్ చేయకుంటే.. ఇక్కడ నుంచి కదలను! ఆ రోజు గంగూలీ ఉగ్రరూపమే!