జింబాబ్వే మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్ రౌండర్ హీత్ స్ట్రీక్ చనిపోలేదని తాజాగా హేన్రి ఒలాంగో మరో ట్వీట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
కొన్ని గంటల క్రితం జింబాబ్వే మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్ రౌండర్ హీత్ స్ట్రీక్ చనిపోయాడని క్యాన్సర్ మహమ్మారీతో పోరాడలేక తుది శ్వాస విడిచాడని సహచర క్రికెటర్ హెన్రీ ఓలాంగో ట్వీట్ ద్వారా వెల్లడించారు. స్ట్రీక్ మరణ వార్త తెలుసుకొని జింబాబ్వే క్రికెట్ ని శోక సంద్రంలో మునిగిపోయింది. బ్యాటర్, బౌలర్, కెప్టెన్ గా జాతీయ జట్టుకి ఎన్నో సేవలను అందించిన స్ట్రీక్ మరణం ఇప్పుడు ఎవ్వరూ జీర్ణించుకోలేకపోయారు. ప్రపంచ క్రికెట్ కూడా అతడి మృతి పట్ల సంతాపం తేలియాజేశాయి. అయితే ఇదంతా అబద్ధమని స్ట్రీక్ బ్రతికే ఉన్నాడని హెన్రీ ఓలాంగో మరో ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ప్రస్తుతం ఈ వార్త తెలుసుకున్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మరోవైపు ఇదంతా వదంతులు అని చెప్పిన ఓలాంగో మీద ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి విషాదకర వార్తలను ద్రువీకరించకుండా పిచ్చి పిచ్చి ట్వీట్లు చేయడమేంటి? అని ఫైర్ అవుతున్నారు. ఇక స్ట్రీక్ మరణ వార్త తెలుసుకున్న జింబాబ్వే స్టార్ ఆటగాడు సీన్ విల్లియమ్స్ సంతాపం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విచారం వ్యక్తం చేస్తూ “చాలా పోరాట స్పూర్తి ఉన్న క్రికెటర్ అని, జింబాబ్వే బెస్ట్ ఆల్ రౌండర్” అని ట్వీట్ చేసాడు. మొత్తానికి స్ట్రీక్ చనిపోయాడని కొన్ని గంటలు ప్రపంచ క్రికెట్ ని అల్లకల్లోలం చేసాడు హెన్రీ ఓలాంగో.
I can confirm that rumours of the demise of Heath Streak have been greatly exaggerated. I just heard from him. The third umpire has called him back. He is very much alive folks. pic.twitter.com/LQs6bcjWSB
— Henry Olonga (@henryolonga) August 23, 2023