దాయాది పోరు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానుల కోసం సూపర్ న్యూస్ వచ్చింది. యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ షెడ్యూల్ విడుదల చేశారు. మొత్తం 6 జట్లుగా ఈ టోర్నీలో పోటీపడనున్నారు. ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా, పాక్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు అర్హత సాధించాయి. క్వాలిఫయర్ ద్వారా హాంకాంగ్, సింగపూర్, యూఏఈ, కువైట్ టీమ్స్ లో ఒకటి టోర్నీకి అర్హత సాధించనుంది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఆగస్టు 28న దుబాయ్ వేదికగా భారత్- పాక్ మ్యాచ్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 2 వరకు గ్రూప్ దశ మ్యాచ్ లు జరగనుండగా.. సెప్టెంబర్ 3 నుంచి సూపర్ 4 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇప్పుడు జరగబోయే ఆసియా కప్పు 15వ ఎడిషన్. ఇప్పటివరకు జరిగిన 14 టోర్నీల్లో టీమిండియా 7సార్లు విజేతగా నిలిచింది. ప్రతి రెండేళ్లకొకసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఈ టోర్నీని నిర్వహిస్తూ ఉంటుంది. కానీ, కరోనా వచ్చిన తర్వాత 2020 టోర్నీని 2021కి వాయిదా వేశారు. కానీ, కరోనా కారణంగా అప్పుడు కూడా జరగలేదు. అంటే 2018 నుంచి ఇప్పటివరకు ఈ టోర్నీని నిర్వహించలేదు. నాలుగేళ్ల తర్వాత ఈ మెగా టోర్నీని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసియా కప్ ని కూడా టీ20 ఫార్మాట్ లో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. టీమిండియా- పాక్ మ్యాచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Men's #AsiaCup2022 schedule released. India will face Pakistan on 28th August. pic.twitter.com/TiTqVgiUYL — ANI (@ANI) August 2, 2022 ఇదీ చదవండి: బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న భారత మాజీ స్టార్ క్రికెటర్! ఇదీ చదవండి: వచ్చే సీజన్ లో ముంబయి ఇండియన్స్‌కు రవీంద్ర జడేజా.. హింట్ ఇచ్చేశాడు!