అంతర్జాతీయ క్రికెట్‌లో సౌతాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఎంతటి విధ్వంసకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్రౌండ్‌కు అన్ని వైపులా క్రికెట్ బుక్స్‌లో లేని షాట్లు ఆడుతూ.. మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించే డివిలియర్స్ ఫీల్డింగ్‌లోనూ కళ్లు చెదిరే విన్యాసాలు చేస్తుంటాడు. ఏబీడీ ఒక గొప్ప బ్యాటరే కాదు.. అద్భుతమైన ఫీల్డర్ కూడా. అతని ఫీల్డింగ్ స్టాండ్స్‌ను అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ చాలా సార్లు చూశాం. టీమిండియా మాజీ కెప్టెన్, భారత అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడైన విరాట్ కోహ్లీ సైతం ఆశ్చర్యపోయే క్యాచ్‌లెన్నో పట్టాడు డివిలియర్స్. ఇక ఏబీడీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత.. అతని బ్యాటింగ్, ఫీల్డింగ్ మెరుపులను క్రికెట్ అభిమానులు బాగా మిస్ అయ్యారు. కానీ.. అదే దేశం నుంచి మరో డివిలియర్స్ పుట్టుకొచ్చాడు.. అతనే బేబీ ఏబీడీ డెవాల్డ్ బ్రెవిస్.
ఈ సౌతాఫ్రికా కుర్ర క్రికెటర్.. అచ్చం డివిలియర్స్ ఆడినట్లే బ్యాటింగ్ చేస్తూ.. ప్రపంచ క్రికెట్‌లో పెను సంచనలంగా నిలుస్తున్నాడు. ఇతనిలోని ఫైర్ చూసి.. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2022లో ఆడించింది. జాతీయ జట్టుకు ఆడకుండానే ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలో అందులోనూ ముంబై లాంటి టాప్‌క్లాస్ ఫ్రాంచైజ్ తరఫున ఆడాడు. ఆ తర్వాత జాతీయ జట్టులోనూ చోటు సాధించాడు. ఇలా చిన్న వయసులోనే అద్భుతాలు సృష్టిస్తున్న ఈ బేబీ ఏబీడీ.. తాజాగా మరో సంచలనం నమోదు చేశాడు. సీఎస్‌ఏ టీ20 లీగ్‌లో తనకొచ్చిన బేబీ ఏబీడీ పేరుకు సార్థకత తీసుకొస్తూ.. కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ చూస్తూ.. బ్యాటింగ్‌లోనూ కాదు.. ఫీల్డింగ్‌లోనూ డివిలియర్స్‌కు సరైన వారసుడిలా కనిపించాడు.
సీఎస్ఏ టీ20 లీగ్ లో భాగంగా టైటాన్స్ వర్సెస్ నైట్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో బ్రెబిస్ ఈ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. నైట్ జట్టు బ్యాటర్ జాక్వెస్ స్నిమాన్ మిడ్ వికెట్ మీదుగా కొట్టిన భారీ షాట్.. సిక్స్‌గా దూసుకెళ్లింది. కానీ.. బౌండరీ లైన్‌పై కాచుకుని నిలబడిన బ్రెవిస్ అమాంతం గాల్లోకి ఎగిరి దాన్ని అందుకుని.. లైన్ దాటుతున్నానని గమనించి దాన్ని గాల్లోకి విసిరి మళ్లీ గ్రౌండ్ లోపలికి దూకుతూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. బ్రెవిస్ అందుకున్న ఈ మ్యాచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ క్యాచ్ ముందు బ్యాటింగ్‌లో బ్రెవిస్ పెను సంచలనం సృష్టించాడు. 35 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకున్న బ్రెవిస్. మొత్తంగా 57 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్సర్లతో 162 పరుగులు భారీ స్కోర్ చేశాడు. దీంతో టైటాన్స్ జట్టు 271 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌ను టైటాన్స్ జట్టు 41 పరుగుల తేడాతో గెలిచింది.
“THIS IS UNREAL!” 🎙️
What can you not do, @BrevisDewald? 🥹🔥pic.twitter.com/jjrDwQoUcz
— MI Cape Town (@MICapeTown) October 31, 2022
No look six by Dewald Brevis. pic.twitter.com/Crz9m6Ndtf
— Johns. (@CricCrazyJohns) November 1, 2022