ప్రపంచ క్రికెట్ లీగ్‌ల్లో పాకిస్థాన్ సూపర్ లీగ్ బెస్ట్ అని పాక్ మాజీ క్రికెటర్లు చాన్స్ దొరికినప్పుడల్లా అంటుంటారు. తమ లీగ్ ముందు ఐపీఎల్ కూడా ఎందుకూ పనికిరాదని వాగుతుంటారు. అయితే బీసీసీఐ నిర్వహించిన డబ్ల్యూపీఎల్ వేలంతో పీఎస్‌ఎల్ పరువు మంటగలిసింది.
బీసీసీఐ తొలిసారి నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలం ముంబై వేదికగా అట్టహాసంగా జరిగింది. ఈ వేలంలో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. మంధాన ఏకంగా రూ.3.40 కోట్ల భారీ ధరను దక్కించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆమెను పొగుడుతూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. టీ20 లీగ్ వేలంలో బాబర్ కంటే మంధానకు అత్యధిక ధర పలకడమే దీనికి కారణం. అతడి కంటే దాదాపుగా డబుల్ రేట్‌కు మంధానను ఆర్సీబీ కొనుగోలు చేసింది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో బాబర్ ఆజమ్ కేవలం రూ.1.34 కోట్లకు అమ్ముడుపోయాడు. అయితే విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో స్మృతి మంధాన (రూ.3.40 కోట్లు)తో పోల్చుకుంటే మాత్రం బాబర్ లీగ్ ధర చాలా తక్కువనే చెప్పాలి.
బాబర్ ఆజమ్‌పై భారత క్రికెట్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ‘నీ కంటే మహిళా క్రికెటర్లు ఎక్కువ ధర పలికారు’ అంటూ బాబర్‌పై ఆన్‌లైన్‌లో పోస్టులు పెడుతున్నారు. ఒకరకంగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) పరువు మరోసారి గంగలో కలిసినట్లయింది. పీఎస్‌ఎల్ కంటే భారత్‌లో ప్రారంభం కానున్న విమెన్స్ ప్రీమియర్ లీగ్ ఖరీదైనదిగా అందరికీ తెలిసొచ్చింది. చాన్స్ దొరికినప్పుడల్లా ఐపీఎల్‌ను తక్కువ చేసి మాట్లాడే రమీజ్ రాజా లాంటి వారు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఇకపోతే, పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అత్యధికంగా ఆర్జిస్తున్న ఆటగాడిగా ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ అలెక్స్ హేల్స్‌ను చెప్పొచ్చు. అతడు ఏటా ఈ లీగ్‌లో ఆడటం ద్వారా రూ.1.50 కోట్లు సంపాదిస్తున్నాడు. ఐపీఎల్‌తో పోటీపడటం పక్కనబెడితే.. విమెన్స్ ప్రీమియర్ లీగ్‌తో కూడా పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ పోటీ పడకుండా ఉంది. మరి, దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Babar Azam and other Pakistani players while watching this Auction.#WPLAuction #WomensIPL pic.twitter.com/RAlP4rSgeD
— Jai Upadhyay (@jay_upadhyay14) February 13, 2023
Smriti (IND) vs Babar (Pak)
WIPL- INR 3.4 cr /$ 4,15,000/ Pak Rs 10.2 cr
Babar PSL salary- INR 1.39 cr/$ 1,70,000/ Pak Rs 4.59 crSmriti>>>>Babar
Babar wanted to Play Women IPL but got unsold😂😂😂😂😂😂
1$= INR 82= Pak Rs 270
1 INR= Pak Rs 3#INDvsPAK #BabarAzam𓃵— Kunal (@kunal11_23) February 13, 2023